Take a fresh look at your lifestyle.

ఇఎంఐల వడ్డీ మాఫీపై నోరుమెదపని కేంద్రం

  • ప్రజలకన్నా కార్పొరేట్లపైనే ప్రేమ
  • ఆర్థిక నిపుణుల సూచనలు పట్టించుకోని వైనం

వేలకోట్లు గడించిన ప్రైవేటు టెల్‌కామ్‌ ‌సంస్థలు యాభైవేల కోట్ల పాత బకాయిలు కట్టడానికి పదేళ్లు వ్యవధి ఇచ్చిన కేంద్రం, మామూలు ప్రజల బ్యాంక్‌ ‌రుణాలకు సంబంధించి ఇఎంఐను రెండేళ్లు వాయిదా వేయడానికి తకిందులవుతోంది. బ్యాంకులు వేలకోట్లు బడాబాబులకు బాకీలు రద్దు చేస్తాయి. కొరోనా వైరస్‌ ‌మహమ్మారి వల్ల ఏర్పడిన ప్రతికూల పరిణామాల నేపథ్యంలో మొండి బాకీలు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌మాజీ గవర్నర్‌ ‌దువ్వూరి సుబ్బారావు ఇప్పటికే హెచ్చరించారు. ప్రజలకు నగదు బదిలీ చేయాలని మరో మాజీ గవర్నర్‌ ‌రఘురామ రాజన్‌ ‌చెప్పారు. చాలా మటుకు బాకీలను దివాలా చట్టం వెలుపలే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉండవచ్చని తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారీ మొండిబాకీల పరిష్కారానికి ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు తప్పనిసరైన అవసరమని దువ్వూరి పేర్కొన్నారు. దివాలా చట్టం(ఐబీసీ) కోడ్‌ ‌కింద కేసులు ఇప్పటికే పేరుకుపోయాయని, కొత్తగా వచ్చేవి న్యాయస్థానాలపై మరింత భారంగా మారతాయని తెలిపారు. కాబట్టి ఐబీసీ పరిధికి వెలుపలే చాలా మటుకు బాకీల పరిష్కారం చోటు చేసుకోవాల్సి రావచ్చని పేర్కొన్నారు.

దివాలా చట్టంతో మొండిబాకీల సమస్య పరిష్కారం కాగలదని, బ్యాడ్‌ ‌బ్యాంక్‌ అవసరం ఉండదని గతంలో భావించానని దువ్వూరి చెప్పారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ అభిప్రాయం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు. కొరోనా వ్యాప్తిలో ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి ఎగబాకుతున్న భారత దేశ పరిస్థితిపై అంతా ఆందోళన చెందుతుంటే ప్రజల దృష్టి మళ్లించడమెలాగని మోడీ ప్రభుత్వం ఆరాటపడుతున్నది. తొలిదశలో చాలా ఆర్భాటంగా వీడియో కాన్ఫరెన్సులు, చప్పట్లు దీపాలు వెలిగించడానికి  పిలుపు ఇచ్చిన ప్రధాని మోడీ సరైన వ్యూహం అనుసరిం చలేదని తేలిపోయింది. ఏకపక్షంగా నిర్ణయించిన లాక్‌డౌన్లు అన్‌లాక్‌ ‌ప్రహసనం పరిమిత ఫలితాలే ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థ ఆ దెబ్బతో పూర్తిగా కుదేలై పోయింది. ప్రజారోగ్యానికి ప్రధానంగా బాధ్యత వహించవసిన రాష్ట్ర ప్రభుత్వ ఖజనాలు ఖాళీ అయ్యాయి. అరకొరగా సర్కారు చికిత్స, అతి ఖరీదైన కార్పొరేట్‌ ‌వైద్యం మధ్య ప్రజలు అల్లాడుతున్నారు. ఉపాధి ఉద్యోగాలు పోయి జీతాలు రాక వచ్చినా అరకొరతో జనం చస్తున్నారు.

వైరస్‌ను అరికట్టడం తమ ఘనత అని జబ్బ చరుచుకుంటూనే అంతా దైవకృతం విధి లిఖితం అంటూ నమేషాలు లెక్కిస్తున్నారు.  తంటాలు రు పడమని ప్రకటించడం ఇందుకు పరాకాష్టగా చూడాలి. కేరళ, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు కేంద్ర విధానం ఆమోదయోగ్యం కాదని ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాయి. కేంద్ర విధానాలలో కార్పొరేట్‌ ‌పక్షపాతం, కష్టజీవుల పట్ల వివక్ష కళ్లకు కట్టినట్టు వెల్లడయ్యాయి. ఇదే సమయంలో అంతర్గత కలహాలలో మునిగిన కాంగ్రెస్‌ ‌నేతలు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. రు బిజెపి అనుకూలమంటే రే వత్తాసుదార్లని పరస్పరం ఆరోపించు కుంటున్నారు. టిఆర్‌ఎస్‌ ఇటీవల కొంత వ్యతిరేకిస్తున్నా ఇతర ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టిడిపి వంటి పార్టీలు బిజెపితో ప్రత్యక్ష, పరోక్ష స్నేహానికి పాకులాడుతున్నాయి. బిజెడి, జెడియు, ఎడిఎంకె వంటివి కూడా అదే తరహాలో వుంటున్నాయి. ఇలాంటి పార్టీల సంగతి ఎలా వున్నా ప్రజల ముందు  ప్రతికూలాంశాలు ఆవిష్కతం కావడం బిజెపికి ఇరకాటంగా మారింది. భద్రత, బాధ్యత లేకుండా విద్యార్థులకు పరీక్షలు జరపాలని నిర్ణయించి అదేదో వారి శ్రేయస్సు కోసమేనని గొప్పగా చెప్పుకోవడం పరీక్షలలో ముంచేస్తే  పట్టించుకోబోరని వ్యూహం తప్ప వైరస్‌ ‌గురించిన ఏమంత చింత లేదన్న తీరు కనిపిస్తోంది. మొత్తంగా ఆర్థికంగా ప్రజలు నడ్డి విరిగి ఉన్నా, ఇఎంఐలపై వడ్డీ మాఫీ చేయాలన్నా కేంద్రం పట్టించుకోవడం లేదు.  మరోవంక 24 శాతం వరకూ జిడిపి పడిపోయి భవిష్యత్తు అయోమయంగా మారినప్పుడు ఎన్ని వ్యూహాలు పన్నినా చెల్లుబాటు కావడం కష్టమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply