Take a fresh look at your lifestyle.

జవాబ్దారీ లేని కేంద్ర ప్రభుత్వం ..!

మార్చ్ ‌నెల లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో పార్లమెంట్‌ ‌సమావేశాలు రద్దయినాయి… అటుపై ప్రస్తుతం సమావేశం అయిన పార్లమెంట్‌ 80 ‌కోట్ల భారతీయులకు ఎందుకు పనికి రాదని రుజువు చేసుకుంది.. ఇలా ఎందుకు అనాల్సివస్తోందంటే.. లాక్‌ ‌డౌన్‌ ‌రివర్స్ ‌మైగ్రేషన్‌ ‌మన సమాజంలో ఓ శాపంలాగా కనిపించింది. భారతీయ సమాజంలో వున్న ఆర్ధిక అసమానత స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు సభ్యసమాజం ముందుకు వచ్చింది.. అతి కీలకమైన రోడ్ల వెంబడి సాగిన వలస కార్మికుల నడకకు సంబంధించి పార్లమెంటులో జరిగిన చర్చ ఇలా సాగింది..

ఎంపీ ప్రశ్న: లాక్డౌన్‌ ‌సమయంలో వేలాది మంది వలస కూలీలు చనిపోయారా?
ప్రభుత్వం జవాబు: అటువంటి డేటా అందుబాటులో లేదు.
ఎంపీ ప్రశ్న: లాక్డౌన్‌ ‌సమయంలో ఇంటికి తిరిగి వెళుతూ మధ్య దారిలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఏదైనా పరిహారం ప్రభుత్వం ఇచ్చిందా ?
ప్రభుత్వం జవాబు : లాక్డౌన్‌ ‌సమయంలో ఇంటికి తిరిగి వెళుతూ మధ్య దారిలో మరణించిన వలస కార్మికుల డేటా లేనందున పరిహారం ఇవ్వటం అన్న ప్రశ్న తలెత్తదు.

దేశంలో అట్టడుగు స్థాయి వ్యక్తి కళ్యాణం కోసం ఏర్పాటు చేయబడిన ఆయున్నత వ్యవస్థ పార్లమెంటు. ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులకు వున్నా అవగాహనా రాహిత్య మేఘం భారతీయ పార్లమెంటును కమ్మేసింది. ప్రశ్నలు అంటే ఇష్టపడని మోడీ ప్రభుత్వం, వలస కార్మికులపై లిఖిత ప్రశ్నకు వచ్చిన వ్రాతపూర్వక సమాధానం తేటతెల్లం చేసేది ఒకటే మనదేశంలో ఆర్ధిక అసమానత అనే అగాధం కార్మికులు తిరగబడితే కానీ పూడ్చలేని అంత పెద్దగా ఉంది.

ఎంపీ ప్రశ్న: ‘‘కోవిడ్‌ -19 ‌మహమ్మారి సమయంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్‌ ‌సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న సమస్యలను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందా.’’ప్రభుత్వం జవాబు: ‘‘భారతదేశం, ఒక దేశంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వయం సహాయక బృందాలు, నివాస సంక్షేమ సంఘాలు, వైద్య ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు పెద్ద సంఖ్యలో నిజమైన, సేవలు అందిస్తూ కొరోనా విపత్తు పట్ల స్పందించాం.. అని బిజెపి ఎంపీ సంగీత సింగ్‌దేయో అలాగే వివిధ పార్టీలకు చెందిన మరో ఐదుగురు ఎంపీలు అడిగితే కేంద్రం సమాధానం చెప్పింది. ఈ లిఖితపూర్వక సమాధానాలు కార్మిక మంత్రి సంతోష్‌ ‌గంగ్వార్‌ ‌కార్యాలయం నుండి వచ్చాయి. మార్చి 23 న చిన్న నోటీసుతో లాక్డౌన్‌ ‌ప్రకటించిన తరువాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో వున్నా వలస కార్మికులు రోడ్లపై కాలినడక ప్రారంభించి దేశ విభజన కాలంలో ప్రజా ప్రయాణాన్ని తలపించిన విషయంపై మోడీ ప్రభుత్వం దగ్గర డేటా లేదు అని పార్లమెంటు సాక్షిగా తేలింది.

వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోవటంపై ప్రభుత్వం ఎటువంటి రికార్డులు సంగ్రహించలేదు అని కార్మిక శాఖామంత్రి గంగ్వార్‌ అం‌గీకరించారు. అయితే, లాక్డౌన్‌ ‌కాలంలో 1.04 కోట్లకు (10,466,152) వలస కార్మికులు తమ సొంత గ్రామాలకి పోయారు అని ప్రభుత్వం మొదటిసారిగా డేటాను అందించింది.మాజీ బిజెపి ప్రస్తత కాంగ్రెస్‌ ఎం‌పీ అయిన అస్సాంకు చెందిన ప్రద్యూత్‌ ‌బోర్డోలోయి అడిగిన ప్రశ్న వాస్తవంగా 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ఆర్థిక వ్యవస్థలోకి పంపించబడిందా..? పంపిస్తే ప్రభుత్వం వివరాలు ఇవ్వాలి అని కోరారు..ఇంత ముఖ్యమైన ప్రశ్నకి ప్రభుత్వం సమాధానం డోలాయమానంగా తేలింది. భారతదేశంలో కోవిడ్‌ -19 ‌మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి భారత జిడిపిలో 10 శాతానికి సమానమైన 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక, సమగ్ర ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ ‌రోజ్గార్‌ అభియాన్‌ ‌కింద సహాయక చర్యలు, ఎంఎస్‌ఎంఇలు.. ఎన్‌బిఎఫ్‌సిలకు సహాయక చర్యలు, గ్రామీణ ఉపాధి కేటాయింపులు పెంచటం వంటి వాటికి ఖర్చుపెడతాం అని మోడీ ప్రభుత్వం చెప్పింది. దీన్ని క్రమం తప్పకండా మోనిటర్‌ ‌చేస్తున్నామని కూడా మోడీ సర్కార్‌ ఎప్పటికప్పుడు చెబుతూ..ఎంపీలు ప్రశ్నిస్తే 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి సంబందించిన గణాంకాలు పార్లమెంటుకి మోడీ సర్కార్‌ ఇవ్వలేకపోయింది.

Leave a Reply