వరంగల్, కరీంనగర్ నగరాలకు ఒక్క రూపాయీ ఇవ్వని రాష్ట్ర సర్కార్
వొచ్చే మున్సిపల్ ఎన్నికలలో విపక్షాలకు ప్రచారాస్త్రంగా ప్రభుత్వ నిర్లక్ష్యం
దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలను స్మార్ట్ సిటీల పేరుతో అన్ని హంగులతో తీర్చిదిద్ది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు రాష్ట్రంలో పక్కదారి పడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ప్రధాని మోదీ స్మార్ట్‌సిటీల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా ఆయా రాష్ట్రాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలను గుర్తించి వాటిని అన్ని రంగాలలో తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తుంది. ఇందులో భాగంగా కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుంచి వరంగల్, కరీంనగర్ నగరాలను ఎంపిక చేసింది. ఈ నగరాల అభివృద్ధికి కేంద్రం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా కొన్ని నిధులను మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే, స్మార్ట్ సిటీ పథకం కింద వరంగల్, కరీనంగర్ నగరాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు విడతలుగా రూ. 500 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో తన వాటాగా కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. పైగా, కేంద్రం ఇచ్చిన నిదులలో సైతం కొంత మేరకే ఖర్చు చేసి మిగతా నిధులను పక్కదారి పట్టించిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిలో వరంగల్ నగరానికి రూ. 23 కోట్లు, కరీనంగర్ నగరంలో రూ. 9 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రభుత్వం మిగతా నిధులన్నీ స్వాహా చేసిందని మండిపడుతున్నారు. కాగా, స్మార్ట్ సిటీల కింద ఎంపిక చేసిన నగరాల పురోగతి, కేంద్రం పంపిన నిధుల ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వం వాటా డబ్బుల వివరాలు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత జూన్ 4న స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా వరంగల్, కరీనంగర్ నగరాలను అభివృద్ధి చేస్తారా ? లేక ఈ పథకం నుంచి ఈ రెండు నగరాలను తొలగించాలా అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీంతో బీజేపీ రాష్ట్ర నేతలు వరంగల్, కరీనంగర్ నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వొప్పిస్తామనీ, స్మార్ట్ సిటీ పథకంలో ఈ రెండు నగరాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, త్వరలో వరంగల్, కరీనంగర్ నగరాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ రెండు నగరాలను స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి చేయకపోగా కనీసం మౌలిక సౌకర్యాలను కల్పించకపోవడాన్ని త్వరలో జరుగనున్న ఎన్నికలలో ప్రచారాస్త్రంగా తీసుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వరంగల్ మున్సిపాలిటీని అప్‌గ్రేడ్ చేసి కార్పొరేషన్‌గా మార్చిన క్రమంలో 42 గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేశారు. ఈ గ్రామాలలో అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. అలాగే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. వందలాది కాలనీలు నీట మునిగి వేలాది మంది ఆస్తికి నష్టం జరిగింది. నగరంలోని చెరువులు, కుంటలు ఆక్రమించి అధికార పార్టీకి చెందిన నేతల అండతో నిర్మించిన కాలనీలు, అపార్ట్మెంట్ల కారణంగా వరద నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు అనేక అవస్తలు పడ్డారు. వందల సంవత్సరాల చరిత్రచరిత్రచరిత్ర కలిగిన చారిత్రక నగరమైన ఓరుగల్లులో కనీసం భారీ వర్షాలు కురిస్తే ప్రజలను కాపాడే వ్యవస్థ లేకపోవడం శోచనీయం. ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తగా వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంగా రూ. 10 వేలు అందజేసింది. ఇదే పద్దతిలో వరంగల్ నగరంలో బాదితులను ఎందుకు ఆదుకోలేదని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. • గతంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరంలో పర్యటించిన సందర్భంగా వరంగల్ టు హైదరాబాద్ మార్గాన్ని బిజినెస్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ హామీ ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ దాని అమలుపై ఊసేలేదు.
టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తాం : రాకేశ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
వరంగల్, కరీనంగర్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. వరద ముంపు బాధితులకు రూ. 25 వేలు ఇవ్వని పక్షంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలను వరంగల్ నగరంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో అవినీతి వరదల్లో కారు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. మా బతుకులు ఏంటని ప్రశ్నించిన బాధితులపై రౌడీయిజం చేయించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వినయభాస్కర్లకు మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.
వరంగల్, కరీనంగర్ నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు. వరద ముంపు బాధితులకు రూ. 25 వేలు ఇవ్వని పక్షంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నేతలను వరంగల్ నగరంలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో అవినీతి వరదల్లో కారు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. మా బతుకులు ఏంటని ప్రశ్నించిన బాధితులపై రౌడీయిజం చేయించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, వినయభాస్కర్లకు మున్సిపల్ ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి స్పష్టం చేశారు.