Take a fresh look at your lifestyle.

రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష ధోరణి

అనేక సంస్థలను ప్రైవేటపరం చేసేందుకు కుట్ర – ప్రొ.కోదండరామ్

రైతులు గత 50 రోజులుగా అనేక విధాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వారిపై కక్ష ధోరణి చేస్తూ వారిపై రబ్బరు బుల్లెట్లతో దాడులు చేయటం విచారకరమని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్ధి ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ అన్నారు. మంగళవారం నాడు గిరిజన అభ్యుతయ భవన్‌ ‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకల్లో రైతులు చేపట్టిన ధర్నాకు కేంద్ర ప్రభుత్వం రబ్బరు బుల్లెట్లు బాష్పవాయువుతో రైతులపై చేపట్టిన కక్ష ధోరణి చర్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

 

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని రైతాంగం గత 50 రోజులుగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వారిపైన చర్యలకు పాల్పడుతుందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పిఆర్‌సి మరియు ఐఆర్‌ ‌తగ్గించి ఉద్యోగస్తులను వాడుకుని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిని తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోదండరామ్‌ ‌తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక లక్ష యాభైవేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే యాభై వేల ఉద్యోగాలు ప్రకటించి నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నారు. అంతేకాకుండా రైతులు ఎంతో మనోవేదనతో కనీస మద్దతు ధర కావాలని ధర్నా చేస్తుంటే కొంతమంది రైతులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపగాని శంకర్‌రావు, రాష్ట్ర నాయకులు మల్లా రామనాధం, జిల్లా అధ్యక్షులు ఎస్‌కె నవీన్‌, ‌పినపాక , భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జీ చెన్నకేశవ వీరభద్రాచారి ,ఉపాధ్యక్షులు దేవదానం , జిల్లా కార్యదర్శి పంపన శివప్రసాద్‌ , ‌పినపాక నియోజకవర్గ ఇన్‌చార్జి సాయిబాబ, శ్రీరామమూర్తి, నాగేశ్వరరావు, ఆదివాసీ సంఘాలు పాల్గొన్నాయి.

Leave a Reply