Take a fresh look at your lifestyle.

మోగిన ఎమ్మెల్సీ నగారా

మార్చి 14న పోలింగ్‌ ‌జరిపేందుకు ఇసి షెడ్యూల్‌ ‌విడుదల

‌తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ ‌విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ‌జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం – వరంగల్‌-‌నల్గొండ, మహబూబ్‌నగర్‌ – ‌రంగారెడ్డి -హైదరాబాద్‌ ‌పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్‌ ‌జరుగనుంది.

నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ ‌జరుగనుంది. తెలంగాణలో ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.‌రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.

Leave a Reply