Take a fresh look at your lifestyle.

కేంద్ర సాంసృతిక, పర్యాటక, ఈశాన్యాభివృద్ది శాఖల..

  • కేబినెట్‌ ‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ ‌రెడ్డి
  • పలువురు ఇతర మంత్రుల బాధ్యతల స్వీకరణ

కేబినేట్‌ ‌మంత్రిగా ప్రమోషన్‌ ‌పొందిన గంగాపురం కిషన్‌ ‌రెడ్డి గురువారం కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డికి ఏకంగా మూడు శాఖలను అప్పగించారు. తనకు ఏ శాఖ ఇచ్చినా. బాధ్యతగా పనిచేస్తానని ఇప్పటికే కిషన్‌ ‌రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కిషన్‌ ‌రెడ్డికి.. సాంసృతిక శాఖ, పర్యాటక శాఖ, నార్త్ ఈ‌స్ట్రన్‌ ‌రీజియన్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌ ‌బాధ్యతలను కేంద్రం అప్పగించింది. అంతేకాదు..సహాయ మంత్రిగా ఉన్న కిషన్‌ ‌రెడ్డికి కేబినెట్‌ ‌హోదా పదవి వరించింది. దీంతో తెలంగాణ బీజేపీలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

పర్యాటకశాఖ సహాయ మంత్రి అజయ్‌ ‌భట్‌, శ్రీ‌పాద నాయక్‌, ‌మినాక్షి లేఖి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషన్‌రెడ్డితో పాటు మరికొంత మంది మంత్రులు కూడా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎలక్ట్రానిక్స్ అం‌డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా రాజీవ్‌ ‌చంద్రశేఖర్‌ ‌బాధ్యతలు స్వీకరించారు. న్యాయశాఖ మంత్రిగా కిరణ్‌ ‌రిజిజు, రైల్వే సహాయ మంత్రిగా దన్వే రావుసాహెబ్‌ ‌దాదారావు, ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా డాక్టర్‌ ‌భారతి ప్రవీణ్‌ ‌పవార్‌, ‌రైల్వేశాఖ సహాయ మంత్రిగా దర్శన్‌ ‌విక్రమ్‌ ‌జర్దోష్‌, ‌పర్యావరణ, కార్మికశాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్‌లు బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర సమాచార ప్రసారాలశాఖ మంత్రిగా అనురాగ్‌ ‌ఠాకూర్‌, ‌రైల్వేశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్‌, ‌కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ ‌మాండవ్య, ఉక్కుశాఖ మంత్రిగా ఆర్‌సీపీ సింగ్‌ ‌బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. బుధవారం కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్‌ ‌మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు.

Leave a Reply