Take a fresh look at your lifestyle.

సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

  • మార్చి 2022 వరకు ‘ఉచిత రేషన్‌’‌కూ ఆమోదం
  • వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌

ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతుల నిరసనలకు కారణమైన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే బిల్లును కేంద్ర కేబినెట్‌ ‌బుధవారం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌మీడియాకు వివరాలు వెల్లడిస్తూ..వ్యవసాయ చట్టాల రద్దుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని శీతాకాల సమావేశాల్లో రద్దు బిల్లుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత మంత్రివర్గం తన ఆమోదం తెలిపింది.

నవంబర్‌ 29 ‌నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందేందుకు కొత్త బిల్లును ఇప్పుడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న దాదాపు 40 రైతు సంఘాల ప్రధాన డిమాండ్లలో ఈ మూడు చట్టాలను రద్దు చేయడం ఒకటి. ప్రధాని మోడీ నవంబర్‌ 19‌న జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం ఈ సంస్కరణల ప్రయోజనాల గురించి నిరసనలు తెలుపుతున్న రైతులను ఒప్పించలేక పోతుంన్నందువల్ల మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు ఇక నిరసనను విరమించి తమ ఇండ్లకు వెళ్లిపోవాలని కూడా ఆయన కోరారు. ప్రధానంగా  2020 సెప్టెంబరులో ఆమోదించబడిన..

రైతు ఉత్పత్తి వ్యాపారం మరియు వాణిజ్యం(ప్రమోషన్‌ ‌మరియు సులభతరం) చట్టం, రైతుల(సాధికారత మరియు రక్షణ) ధర హామీ మరియు వ్యవసాయ సేవల చట్టం యొక్క ఒప్పందం మరియు ఎసెన్షియల్‌ ‌కమోడిటీస్‌ (‌సవరణ) చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, ‌హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో తమ నిరసనలు చేపట్టారు. ఇక మార్చి 2022 వరకు ఉచిత రేషన్‌ ‌పథకానికీ కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌వెల్లడించారు.

Leave a Reply