Take a fresh look at your lifestyle.

కొత్త ఎన్నికల కమిషనర్‌గా అనూప్‌ ‌చంద్ర పాండే నియమించిన కేంద్ర కేబినెట్‌

నూతన ఎలక్షన్‌ ‌కమిషనర్‌గా ఉత్తరప్రదేశ్‌ ‌కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఎఎస్‌ అధికారి అనూప్‌ ‌చంద్ర పాండేను కేంద్ర కేబినేట్‌ ‌నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్యానల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇద్దరు ఎలక్షన్‌ ‌కమిషనర్లు ఉంటారు.

ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు జరిగిన సమయంలో అంటే ఏప్రిల్‌ 12‌న సుశీల్‌ అరోరా ప్రధాన ఎన్నికల అధికారిగా రిటైర్డ్ అయ్యారు. ఆయన స్థానంలో సుశీల్‌ ‌చంద్ర ఎన్నికయ్యారు. మరో ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్‌ ‌కుమార్‌ ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్యానల్‌ ‌దృష్టి సారించనుంది.

తాజాగా ఎన్నికయిన అనూప్‌ ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విధేయుడని తెలుస్తున్నది. 2019లో ఐఎస్‌ఎస్‌గా రిటైర్డ్ ‌కాకముందు ఆదిత్యనాథ్‌ ‌సర్కార్‌కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. అనూప్‌ ‌చంద్ర 2024 ఫిబ్రవరి వరకు కమిషనర్‌గా కొనసాగనున్నారు.

Leave a Reply