వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మొదలైన కేంద్ర బడ్జెట్‌ ‌ప్రక్రియ

January 20, 2020

Involved in the halwa preparation program
హల్వా తయారీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌

కేంద్ర బ్జడెట్‌ ‌పక్రియ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. అధికారులు బిజీ బిజీగా అయిపోతున్నారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2020 – 21 కేంద్ర బ్జడెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన పత్రాల ముద్రణ మొదలు అయ్యింది. అయితే..ఈ పక్రియ మొదలు పెట్టడానికి ముందు…సంప్రదాయబద్దంగా వస్తున్న హల్వా తయారు చేయడం ప్రారంభించారు. సోమవారం నార్త్ ‌బ్లాక్‌లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యాయలంలో హల్వా వేడుకల్లో నిర్మలాసీతారమన్‌ ‌పాల్గొన్నారు. పెద్ద కడాయిలో హల్వాను తయారు చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, బ్జడెట్‌ ‌తయారీలో పాల్గొనే అధికారులకు హల్వా రుచి చూపించారు. ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం బ్జడెట్‌ ‌లోక్‌ ‌సభలో ప్రవేశపెట్టేంత వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉంటారు. బడ్జెట్‌ ‌రూపకల్పన ఎలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతారు. ఇందులో పాల్గొనే కీలక అధికారులు, సహాయ సిబ్బందికి ఆంక్షలుంటాయి.

పని మొదలైనప్పటి నుంచి..పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కుటుంబసభ్యలుతో కూడా మాట్లాడనీయరు. పోన్‌, ఈమెయిల్‌ అం‌దుబాటులో ఉండవు. ఎవరితో సంప్రదింపులు వీలుండదు. ఆఫీసు లోపలకు బయటి వ్యక్తులకు నో ఎంట్రీ. బ్జడెట్‌ ‌పూర్తిగా అయిపోయిన తర్వాత తలుపులు తెరుస్తారు. ముద్రణకు పంపే ముందు…హల్వా తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ సిబ్బంది పనిలో నిమగ్నం కావడానికి కంటే ముందు..వారికి తీపి తినిపించాలనే ఉద్దేశ్యంతో హల్వా తయారు చేస్తారు. ఇది ఆచారంగా వస్తోంది. హల్వా తయారీతో బ్జడెట్‌ ‌ప్రతుల ముద్రణ ప్రారంభిస్తారు. 1950 వరకు బ్జడెట్‌ ‌ప్రతులను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ..అక్కడ బయటకు పత్రాలు బయటకొచ్చాయి. దీంతో మింట్‌ ‌రోడ్డులోని గవర్నమెంట్‌ ‌ప్రెస్‌కు మార్చారు. అనంతరం 1980లో నార్త్ ‌బ్లాక్‌లోని బేస్‌ ‌మెంట్‌కు మార్చారు. అప్పటి నుంచే ఇక్కడే కొనసాగుతోంది. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌, ‌సహాయమంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags: Central budget, process, nirmala seetharaman, halwa preparation program