Take a fresh look at your lifestyle.

తెలంగాణ విజ్ఞాపనలపై …కేంద్రం బేఖాతర్‌

Airports in kothagudem, Ramagundam, Adilabad, Nizamabad

  •  ‌రాష్ట్ర ప్రభుత్వ వినతులపై స్పందించని కేంద్రం
  •  తెలంగాణపై కేంద్రం వివక్ష
  • వందలసార్లు  విజ్ఞప్తులు 

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం చేసిన, చేస్తున్న విజ్ఞప్తులన్నింటినీ కేంద్రం బేఖాతరు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ సర్కార్‌ ఉన్నప్పటికీ, తెలంగాణ వినతులపైన ఏనాడు కేంద్ర పెద్దలు స్పందించలేదు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి తెలంగాణపై వివక్ష చూపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా చేనేత్లస్టర్లు ఏర్పరచాలని ఐదు సంవత్సరాలుగా చేస్తున్న విజ్ఞాపనలకు అతీగతీలేదు.సిరిసిల్ల, పొచంపల్లి, పుట్టపాక, కొయ్యలగూడెంలలో చేనేత క్లస్టర్లు ఏర్పరచాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. వరంగల్‌లో టెక్స్‌టైల్‌పార్క్‌ను ఏర్పాటుకు ప్రోత్సాహించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తులు వెళ్లాయి. మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ వంటి పథకాలను కేంద్ర మంత్రులు వరుసగా పోటీలుపడి ప్రశంసించారు.మిషన్‌భగీరథకు నీతిఅయోగ్‌ ‌నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది కూడా. కానీ కేంద్రం మాత్రం ఒక్క నయాపైసా విదిల్చలేదనేది తెలంగాణ నేతల విమర్శ.ఫార్మాసిటీ, ఉక్కుఫ్యాక్టరీ, పారిశ్రామికకారిడార్‌,‌డిఫెన్స్ ‌కారిడార్‌, ఐటీఆర్‌, ‌హైదరాబాద్‌ ‌రోడ్లవిస్తరణ, రక్షణభూముల బదలాయింపు, తెలంగాణ పవర్‌లూం ప్రాజెక్ట్, ‌బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ వంటి అనేక విషయాలను కేంద్రం ఎటూ తేల్చ•కుండా నాన్చివేత వైఖరిరి అవలంబిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. ఒక్క సిరిసిల్లలోనే 36వేల పవర్‌లూంలు, 400పడుగుదారాల యంత్రాలు, 250 డైయింగ్‌యూనిట్లు 20వేల మంది కార్మికులు అక్కడ శ్రమిస్తున్నారు. ఈ అంశాలతోపాటు తెలంగాణలోని మిగతా చేనేత గ్రామాలన్నింటినీ పరిశీలించి, పరిగణనలోకి తీసుకొని 14 క్లస్టర్లు చేయడానికి వీలుంటుందని, వీటన్నింటినీ అభివృద్ధి చేస్తే ఒకలలక్ష మంది చేనేత కార్మికుల బతుకులు బాగుపడతాయని కేంద్రానికి సమర్పించిన నివేదికలో తెలంగాణ ప్రభుత్వం తెలియచేసింది.

అయినా వీటిపై ఏ వైఖరిని కేంద్రం తెలియచేయలేదు. జాతీయ చేనేత ఇనిస్ట్యూట్‌ ఏర్పాటు చేయాలని,టెక్స్‌టైల్‌ ‌పరిశీధనా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పరచాలని, 29రాష్ట్రాలకు చేనేతలో తెలంగాణ ఆదర్శంగా ఉన్నదని నివేదించిన అంశాలకు జవాబేలేదు. చేనేతను ఉత్పత్తులకు తెలంగాణలో ఉన్నన్ని అవకాశాలు మరే రాష్ట్రంలో లేవని వినతులలో వివరించారు. హైదరాబాద్‌లో చేనేత ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభత్వం కోరింది. కానీ కేంద్రం పట్టించుకోలేదు.వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా శాయంపేటలో మెగాటెక్స్‌టైల్‌పార్క్‌కు ఉన్న అవకాశాలను కేంద్రానికి నివేదించారు. వ్యర్ధాల శుద్ధీకరణ ప్లాంట్‌లకు ఆర్థికసాయం అందించాలని కోరారు. గంగానది ప్రక్షాళనకు కేంద్రం సాయం చేసినట్లుగానే మూసిప్రక్షాళనకు ఆర్థికంగా సహరించాలని కోరారు. తద్వారా పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఐఆర్‌పైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌ప్రధానమంత్రిని, ఆర్ధికమంత్రిని కలిసి అనేకసార్లు విజ్ఞాపనలు అందించారు.ఐటీఆర్‌ ‌ప్రాజెక్ట్‌కు 2010లో ప్రారభమైంది, తొలిదశలో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.4863 కోట్లు మంజూరు చేసింది.2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు రూ. 942కోట్లు, 2011-12లో , 2012-13లో రూ.3921కోట్లు మంజూరు చేసింది. ఐటీ ఉత్పత్తులో తెలంగాణ బెంగుళూర్‌లో పోటీపడుతున్నది.ఉత్పత్తులు రూ.2లక్షలకోట్లకు పెరిగాయని ఇటీవల కేంద్రానికి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రం ఐటీఆర్‌ ‌ప్రాజెక్ట్‌కు నిధులివ్వాలన్న విజ్ఞప్తిని ఖాతరు చేయలేదు. తెలంగాణలోని ముఖ్యపట్టణాల్లో, పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాల్లో విమానాశ్రాయాలు ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తిని పట్టించుకోలేదు.

కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌మహబూబ్‌నగర్‌, ‌తదితర ప్రాంతాలలో విమానాశ్రాయాలను నెలకొల్పాలని కేంద్రం అనుమతిని ఇస్తే భూసేకరణకు కొదువలేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన మహావిజ్ఞాపనలో పేర్కొన రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులుందరూ వివిధ సందర్భాలలో కేంద్ర ప్రభుత్వానికి తమ తమ శాఖల తరపున చాలా విజ్ఞాపనలను అందించారు. వీటిపై కేంద్రం స్పందించనలేదు.
హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో రోడ్ల విస్తరణలు, ఫ్లైఓవర్‌నిర్మాణాలు, స్కైవేలు నిర్మాణాలకు కేంద్ర విభాగాల అధీనంలోని భూములను ఇవ్వాలని కోరిన విజ్ఞాపనలను ఖాతరు చేయలేదు. సెక్రటేరియట్‌ ‌నిర్మాణకోసం బైసన్‌పోలో మైదానం ఇవ్వాలని, బదులుగా ఎక్కువ భూములు డిఫెన్స్‌శాఖకు ఇస్తామని కోరారు. కేంద్రంలో వివిధ సందర్బాలలో రక్షణశాఖ మంత్రులుగా వ్యవహరించిన అరుణ్‌జైట్లీ, మనోహర్‌పారకర్‌, ‌నిర్మలాసీతారామన్‌లకు ప్రస్తుత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతులను అందచేశారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్‌ఫ్యాక్టరీ తెరిపించాలని, కృష్ణానది, తుంగభద్ర జలాల్లో తెలంగాణవాటాను పరిరక్షించాలని,ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు విధానానికి చట్టబద్దత కల్పించాలని తెలంగాణ ప్రభత్వం విజ్ఞప్తులు చేసింది. స్మార్ట్‌సిటీపథకంలో చేర్చాల్సిన పట్టణాల జాబితాలను కేంద్రానికి అందించారు. రామప్పఔన్నత్యాన్ని వివరిస్తూ యునెస్కో గుర్తింపునకు సిఫారసు చేయాలని కోరారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదాను ఇవ్వాలని, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే మంజూరు చేయాలని చేసిన విజ్ఞాపలన్నింటినీ కేంద్రం బేఖాతర్‌ ‌చేసింది.

Tags: Airports in kothagudem, Ramagundam, Adilabad, Nizamabad, Karimnagar, Warangal, Mahabubnagar, etc.

Leave a Reply