Take a fresh look at your lifestyle.

పోలవరం పెంచిన అంచనాలకు కేంద్రం ఆమోదం

  • ఎపికి సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రం సుముఖత
  • కేంద్ర కార్యదర్శుల బృందంతో ముగిసిన భేటీ
  • సానుకూల నిర్ణయాలు ఉంటాయన్న ఎంపి విజయసాయి

న్యూఢిల్లీ, జనవరి 24 : ఏపీకి జీవనాధారం అయిన పోలవరం ప్రాజెక్ట్ ‌ని త్వరగా పూర్తిచేయాలని, అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రెండున్నర గంటలపాటు కొనసాగిన సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విజయసాయి రెడ్డి తెలిపారు. గత పర్యటన సందర్బంగా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రం లోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించిడంతో పాటు పరిష్కార మార్గాలను అన్వేషించామని అన్నారు. సమావేశం చాలా సానుకూలంగా జరిగిందని,త్వరలోనే కేంద్రం నుంచి మంచి సమాచారం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. కేంద్ర కార్యదర్శుల బృందంతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసింది. సుమారు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం , వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి డియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించా మని,పరిష్కార మార్గాలను అన్వేషించా మన్నారు. సమావేశం మొత్తం సానుకూలంగా జరిగిందని, త్వరలోనే మంచి సమాచారం వస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగిం పుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి, ఈ అంశాలన్నింటినీ ముందు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్టాన్రికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని అన్నారు. ముఖ్యమంత్రికి, రాష్టాన్రికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశం నిదర్శనమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20మంది ఉన్నతాధి కారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దీనికి కొనసాగింపుగా సంబంధిత రాష్ట్ర అధికారులు నిరంతరం సంప్రదింపులు చేస్తారు. పెండింగ్‌ అం‌శాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తారు. పోలవరం సవరించిన అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చాం అని అన్నారు. పోలవరం పునరావాసంతో సహా అన్ని అంశాలపై ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయన్నారు. రెవెన్యూ లోటు పై చర్చించాం. బ్జడెట్‌ ‌సమయంలో బిజీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు రెండున్నర గంటల సమయం ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన వినతి పత్రం, ప్రధాని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రికి, రాష్టాన్రికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశం నిదర్శనం అని విజయసాయిరెడ్డి అన్నారు.

Leave a Reply