Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్రాలు విఫలం

  • సిఎం జగన్‌ ‌బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నారు
  • విమర్శలు చేస్తే కేసుల పెట్టడం దుర్మార్గం
  • మాస్కు పెట్టుకోని సిఎం ఏ సందేశం ఇస్తున్నారు : అచ్చన్నాయుడు

అమరావతి : కరోనా నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం డియాతో మాట్లాడుతూ పారాసిట్మాల్‌, ‌బ్లీచింగ్‌తో కరోనా పోతుందని సీఎం మాట్లాడి.. నాన్‌ ‌సీరియస్‌గా తీసుకున్నారని మండిపడ్డారు. ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వకుండా..కరోనాతో సహజీవనం చేయాలని ముఖ్యమంత్రి అనడం దారుణమన్నారు. కరోనా విషయంలో దేశంలోనే ఏపీ 5 వ స్థానంలో ఉందని ఆయన తెలిపారు. గ్లోబల్‌ ‌టెండర్లను తమ ఒత్తిడితోనే పిలిచారన్నారు. జగన్‌…అబద్దాల ముఖ్యమంత్రి.. కరోనా మరణాలపై అబద్దాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. వెంటిలేటర్లు బెడ్స్ ‌కావాలని పీఎంకు జగన్‌ ‌లేఖ రాయాలని డిమాండ్‌ ‌చేశారు. వ్యాక్సిన్‌ ‌తయారు చేసే కంపెనీలకు కులం ఆపాదించడం దారుణమన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వడం లేదని… వైసీపీ నేతలకు,కార్యకర్తలకు ఇస్తున్నారని ఆరోపించారు. ఏపీ నుంచి తెలంగాణాకు అంబులెన్సులు పంపించడం చేతకాని సీఎం జగన్‌ ‌సీఎంకు, ఆరోగ్య శాఖ మంత్రికి ఛాలెంజ్‌ ‌చేస్తున్నాను…ఆరోగ్యశ్రీలో ఎంత మందికి వైద్యం అందించారో శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు. విజయ సాయిరెడ్డి  ఈ రోజు 300 బెడ్స్ ఆసుపత్రిని ప్రారంభించారని..ఆయనకు ఇప్పుడు గుర్తు వచ్చిందా? అని ప్రశ్నించారు. కరోన ద ఎవరైనా మాట్లాడితే.. కేసులు, అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కొనసాగిస్తే..కొత్తగా ఆసుపత్రిలు వచ్చేవి..బెడ్స్ ‌కొరత వచ్చేది కాదన్నారు. ఏపీ నుంచి వచ్చిన అంబులెన్సు కేసీఆర్‌ అనుమతి ఇవ్వాలని కోరారు. కరోనా తీవ్రత దృష్ట్యా10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, ఇప్పటికే కరోనా మహమ్మారివల్ల 9,10వేల మంది చనిపోతే ముఖ్యమంత్రి ఏంచేశారని ప్రశ్నించారు.  వ్యవసాయశాఖ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాస్క్ ‌లేకుండా కనిపించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఒక్క జగన్‌కు తప్ప అందరికీ మాస్క్ ఉం‌దని అన్నారు.

తమిళనాడులో సినీ పరిశ్రమకు సంబంధించినవారు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చెక్కు ఇవ్వడానికి వెళితే.. సీఎం మాస్క్ ‌పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించారన్నారు. స్టాలిన్‌ను చూసి జగన్‌ ‌నేర్చుకోవాలన్నారు. ఏపీ రాష్ట్రంలో కనీసం పేదలకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్నా క్యాంటిన్లు పెట్టామని, రూ. 5లకే పేదలకు భోజనం అందించామన్నారు.ఈ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లు అలాగే కొనసాగించితే పేదలు భోజనం చేసేవారన్నారు. సీఎం జగన్‌ అన్నా క్యాంటిన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటిన్‌ ‌పేరు ఇష్టం లేకపోతే కనీసం వైఎస్‌ ‌పేరుద అయినా ఆ క్యాంటిన్లు కొనసాగిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Leave a Reply