Take a fresh look at your lifestyle.

వెల్ఫేర్‌ ‌బోర్డు ను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

బిల్డింగ్‌ అదర్‌ ‌కన్స్ట్రక్షన్స్ ‌వర్కర్స్ ‌యూనియన్‌ ‌సిఐటియు అనుబంధ సంఘం కేంద్ర కమిటీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్లే కార్డు పట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు పట్టణ కన్వీనర్‌ ‌వై.వి రామారావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక కార్మికులు భవన నిర్మాణ రంగం పై ఆధారపడి బతుకుతున్నారు.

అటువంటి నిర్మాణరంగంలో కార్మిక వర్గాన్ని ఆదుకుంటామని ఎన్నికల్లో వెల్ఫేర్‌ ‌బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కార్మికులు ఆదుకుంటామని చెప్పిన బిజెపి, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దేశం మొత్తం మూడు నెలల పాటు లాక్డౌన్‌ ‌విధిస్తే బోర్డు ద్వారా కనీసం ఒక్క  రూపాయి కూడా కార్మికులకు ఇవ్వలేదని, తక్షణమే ప్రతి కార్మికుడికి 1500 రూపాయలు ఇవ్వాలని బోర్డు నుండి వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బదలాయింపు జరిగిందని సెజులు ద్వారా వచ్చిన డబ్బులను బోర్డు కి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు యం బి నర్సారెడ్డి, ఎన్‌ ‌వి ఎస్‌ ‌నారాయణ, నాగరాజు,బిసిడబ్ల్యూ  నాయకులు ఎస్కే జాకీర్‌ ,‌సిహెచ్‌ ‌రమేష్‌, ‌మధు, చింతలపూడి శ్రీనివాస్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!