కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను గాలికి వదిలేశాయి
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షమాన్ని గాలికి వదిలేసాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ డబ్బులు వెయ్యి కోట్లు టిఆర్ఎస్ ప్రభుత్వం స్వంతంగా వాడుకుందని ఆరోపించారు.శుక్రవారం గాంధీ భవన్ లో మే డే వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జెండా ఎగరవేశారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కర్యక్రమంలో మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, లేబర్ సెల్ అధ్యక్షులు ప్రకాష్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కరోనో సమయంలో చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతున్న వర్గం కార్మికులు, పేదలేనని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వలస కార్మికులను, పేదలను ఆదుకోవడానికి ఎంతో శ్రమిస్తున్నారు వారిని అభినందిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎంతమంది వలస కార్మికులు ఉన్నారో కూడా ఈ పాలకులకు తెలియడం లేదని ఒక్కొక్కరు ఒక్క మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పలు దేశాలలో కార్మికుల సంక్షేమానికి కంపిణీలకు సబ్సిడీ ఇస్తుంటే మన దగ్గర అవ్వి ఇవ్వకపోగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కూడా కోత పెడుతున్నారని త్వరలో గవర్నర్ ను కలిసి రాష్ట్ర సమస్యలను విన్నవిస్తమన్నారు .