Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను చిన్న చూపు చూస్తున్నాయి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్

దళితులపై ఎక్కడ దాడి జరిగిన అండగా నిలిచింది కాంగ్రెస్‌ ‌పార్టీ మాత్రమే నన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి .దళితుల పై దాడులు అమానవియమని అన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు.దళితున్ని సీఎం చేస్తా అని కనీసం ఓ మాదిగను మంత్రిని కుడా చేయలేదని విమర్శించారు.శనివారం ఇందిరాపార్క్ ‌లో మహిళల పై దాడులకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌ ,‌మహిళా కాంగ్రెస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌నేరెళ్ల శారద ,ఎస్సీ సెల్‌ ‌చైర్మన్‌ ‌ప్రీతమ్‌ ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది .ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ,ఎమ్మెల్యే జగ్గారెడ్డి ,మాజీ మంత్రి గీతారెడ్డి ,మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ ఇతర కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఉత్తమ్‌ ‌మాట్లాడుతూ …ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌లోని

హత్రాస్‌ ‌లో జరిగిన ఘటన అమానవీయమని దేశం తలవంచుకుందని బీజేపీ ప్రభుత్వ వైఖరి దళితులు, మహిళల పట్ల దారుణంగా ఉందని మండిపడ్డారు . తెలంగాణలో దళితులు, గిరిజనులు, మహిళకు ఎక్కువ అన్యాయం జరుగుతోందని మాదిగలకు కనీసం మంత్రివర్గంలో చోటివ్వలేదని కానీ కేసీఆర్‌ ‌తన సామాజిక వర్గానికి 6 శాఖలు ఇచ్చుకున్నారని విమర్శించారు .మహిళల పై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయని రాజేంద్రనగర్‌ ‌లో ఒక మైనారిటీ అమ్మాయిని ఒక టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు అత్యాచారం చేసి హత్య చేశారని ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలను ప్రతిఘటించాలన్నారు.

అణగారిన వర్గాల పక్షాన కాంగ్రెస్‌ ‌పోరాటం చేస్తుందని దళితులు, మహిళల సంక్షేమానికి కాంగ్రెస్‌ ‌శ్రమిస్తుందన్నారు .ఇక ఏఐసీసీ సంపత్‌ ‌కుమార్‌ ‌ప్రసంగిస్తూ …దళితుల పోరాటంతో వచ్చిన తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి దళితులంటే వ్యతిరేకం అన్నారు. అందుకే దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు .కాంగ్రెస్‌ ‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు మాజీ మంత్రి గీతా రెడ్డి. దామోదరం సంజీవయ్యను సీఎం చేసింది కాంగ్రెస్‌ అని గుర్తు చేశారు .కాంగ్రెస్‌ ‌దళితుల కోసం సబ్‌ ‌ప్లాన్‌ ‌తెస్తే.. కేసీఆర్‌ ‌దాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాల, మాదిగ అంత సంఘటితమై కేసీఆర్‌ ‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply