కేంద్ర ప్రభుత్వం చర్చ లేకుండా ఏక పక్షంగా వ్యవసాయ బిల్లులు ఆమోదింప చేసుకోవడం రైతు వ్యతిరేకమేనని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఎంఎస్పీ కొరకు చట్టబద్ధత లేక పోవడం రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతకు కారణమని అన్నారు. గురువారం ఫేస్ బుక్‌లో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ…. కెసిఆర్ వీటిని వ్యతిరేకించడం తన నియంతృత్వ సాగు విధాన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే నాటకం మాత్రమేనని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నియంతృత్వ సాగు విధానం అమలు చేస్తుందని అన్నారు. పంటకాలం రాష్ట్రంలో ఎన్ని ఎకరాలలో ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, దీంతో రైతులు ప్రభుత్వ ఇష్ట ప్రకారం పంటలు వేయాలి తప్ప వారి అనుకూలంగా వేసే పరిస్థితి లెదని అన్నారు.
తాము చెప్పిన పంటలు వేయకపోతే రైతుబంధు, రుణమాఫీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు రావని ప్రభుతం ఒక రకంగా రైతులను బ్లాకె•మెయిల్ చేస్తుందని ఆరోపించారు. పత్తి పంటలు, వరి విరివిగా వేయాలని, మొక్కజొన్న పూర్తిగా తగ్గించాలని, సోయా అధికంగా వేయాలని ప్రభుత్వం చెప్తుంది కానీ రైతుల నుంచి పండిన పంటలకు కొనుగోలు గ్యారంటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. గతంలో కందిపంటలు బాగా వేయాలని కేసీఆర్ చెపితే రైతులు అధికంగా వేశారని తీరా పంటలు పండాక కొనే వారు లేక రోడ్లపై పోసి తగలబెటారని గుర్తు చేశారు. మొన్న కొరోనా సమయంలో బత్తాయి ఒక్క కాయ కూడా బయటకు పోవొద్దు అంత ఇక్కడే అమ్ముకోవాలి అని చెప్పారు. కానీ తీరా చూస్తే ధరలు పూర్తిగా పడిపోయి బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేసీఆర్ తన దత్తత గ్రామలైన ఎర్రవెల్లి, నరసన్నపేట గ్రామాలలో మోడల్ అగ్రికల్చర్ చేసి పూర్తిగా విఫలం అయ్యారని సుమారు 450 కోట్ల ప్రజా ధనం వృధా జరగడం ప్రజలు గమనించారని అన్నారు.