Take a fresh look at your lifestyle.

కార్పొరేట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేలా కేంద్ర వ్యవసాయ చట్టాలు

  • నల్ల చట్టాల వ్యతిరేక ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలి
  • రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పలువురు వక్తలు

కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు కార్పొరేట్ శక్తులకు పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా ఉన్నాయని పలువురు వక్తలు ఆరోపించారు. అంబానీ, అదానిల కోసమే మోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందని, ఈ చట్టాలు బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయని అన్నారు. సన్న, చిన్నకారు రైతులకు రక్షణ కరువైందని, రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకుని, విద్యుత్ బిల్లు 2020ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆలిండియా రైతు సమన్వయ పోరాట కమిటీ, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నా కార్యక్రమానికి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఏఐకేఎస్ సీసీ పంజాబ్ నాయకుడు సబ్బీర్ సింగ్, సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డిలు ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకరావడం రైతాంగ ఆహార భద్రతకు ప్రమాదమని అన్నారు.

Central agricultural laws to give complete freedom to corporate powers

ఈ చట్టాలు అంబానీ ఆదానీలకు లాభం తప్ప రైతులకు తీవ్ర నష్టమన్నారు. కార్పొరేట్ వ్యవసాయ నల్ల చట్టాలపై దేశ వ్యాప్తంగా కదిలి డిల్లీకి చేరిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలన్నారు. కనీస మద్దతు ధరను కల్పించాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అరుణోదయ సంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాజీ ఎంపీ అజీజ్ పాషా, రైతు సంఘం నాయకుడు పశ్య పద్మ, సాగర్, విస్సా కిరణ్, సుధాకర్, రంగారావు, రవి, ఎస్ యూ సీఐ నాయకులు మురహరి, న్యూ డెమొక్రసీ నాయకులు గోవర్ధన్, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply