Take a fresh look at your lifestyle.

పంటలకు మద్దతు ధరలను పెంచిన కేంద్రం

నాగర్‌ ‌కర్నూల్‌, ‌జూన్‌ 3.‌ప్రజాతంత్రవిలేకరి: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ ‌దాడికి కకా వికలమైన పరిస్థితుల్లో కూడా భారతప్రధాని నరేంద్రమోదీ రైతుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని బీజేపీ నాగర్‌ ‌కర్నూ ల్‌ ‌పార్లమెంట్‌ ‌కన్వీనర్‌ ‌బుసిరెడ్డి సుధాకర్‌ ‌రెడ్డి అన్నారు .ఆయన బుధవారం జిల్లా కేం ద్రంలో విడుదల చేసిన ఒక ప్రకటన లో మా ట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంల లో పంటలు చేతికొ చ్చినా మద్ధతుధర కొరకు ఎదురు చూసి చూసి వేసారి అయినకాడికి రైతులు తమ పంటలను దళారులకుఅమ్ము కున్న తర్వా త తాఫీగా మద్ధతు ధరను పదో పరకో పెంచి చేతులు దులుపుకునేవని అ న్నారు. పెంచినమద్ధతు ధరలు కూడా దళా రులకు ఉపయోగపడేవి తప్ప రైతులకు ఏ మాత్రం ఊరటనిచ్చేవి కావు. తద్వారా గిట్టు బాటు ధరలు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడేవారని అన్నారు. మరోవైపు బ్లాక్‌ ‌మార్కటీర్లు రాజకీయ అండ దండలతో బ్యూరోకాట్ల అవినీతివల్ల విని యోగదార్లకు విపరీతంగా ధరలు పెంచి అ మ్మేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు.దీం తో రైతులు వినియోగదార్ల పరిస్థితి అమ్మ బోతేఅడవి కొనబోతేకొరివి గా తయారైందని అన్నారు.

పర్యవాసనంగా రైతులు తమ వ్యవసాయ కమతాలను తెగనమ్ముకోవడం పరిపాటైంది, కోటానుకోట్లు అప్పనంగా వెను కేసుకున్న వ్యాపార రాజకీయ దళారీలు ఎంతటి ధరనైనా చెల్లించి భూములు కొని మళ్లీ రియల్టర్లుగా కోటానుకోట్లు సంపాదిం డం పరిపాటైందని,ఇంతగావేళ్లూనుకొన్న ఏళ్ల నాటిదుస్తంత్రాలను మార్చడానికి 2014 నాటినుండి మోదీ ప్రభుత్వం 24 గంటలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని అన్నారు. ఆ క్రమంలో నూటికి డెబ్బై మంది ఆధారపడే వ్వవసాయధారిత భారతదేశంలో అన్నధా తలకు మేలుచేకూర్చే సంకల్పంతో ఖరీఫ్‌ (‌వర్షాకాల) సీజన్‌ ‌ప్రారంభానికి ముందే పంటలకు మద్ధతు ధరలను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రకటిస్తున్నది. దశాబ్ధాలుగా పదో పరకో పెంచి చేతులు దులుపేసుకునే భాధ్య తా రాహిత్య పోకడలను సమూలంగా మా ర్చటం జరిగిందని అన్నారు.రైతుల ఆధా యం రెండింతలు కావాలనే లక్ష్యం చేరాలం టే వారి పంటలకు ఏటికేడు మద్ధతు ధరల ను బారీగా పెంచి ప్రకటించి ప్రోత్సహిస్తున్న దని అన్నారు. ఇంతే గాక రైతులు పండించి న పంటలు చేతికొచ్చేసరికి మద్ధతు ధరలకు ధాన్యాన్నం తా కేంద్ర ప్రభుత్వమే కొని రైతుల ఖాతాలకు డబ్బు జమచేస్తున్నదని తెటలిపారు.ఈ సంవ త్సరం ఖరీఫ్‌ ‌సీజన్‌ ‌ప్రా రంభానికి ముందే వివిధ రకాల పంటలకు 53 రూపాయల నుండి 755 రూపాయల వరకు బారీగా పెంచడం మోదీప్రభుత్వం యొక్క క్రియాశీల సాహసోపేత ముందడుగు కాబట్టి రైతులంతా హర్షిస్తున్నారనిఅన్నారు. రైతులసంక్షేమం పట్ల మోది ప్రభుత్వ సాను కూల చర్యలవల్ల వ్యవసాయం లాభసాటిగా వర్ధిల్లగలదని విశ్వసిస్తూ మనప్రియతమ ప్రధాని మోది గారికి రైతులంతా కృతజ్ఞలు తెలుపుతున్నారని అన్నారు.

Leave a Reply