Take a fresh look at your lifestyle.

కేంద్రం తీరు బాధాకరం ..!

  • మనవద్దే ఉత్పత్తి అవుతున్నా పంపిణీలో మొండిచేయే
  • రెమ్‌డెసివర్‌ ‌కూడా మనమే కొంటున్నాం
  • వ్యాక్సిన్‌ ‌కొరత తీర్చాలని కోరుతున్న నిర్లక్ష్యమే
  • మండిపడ్డ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌

తెలంగాణకు వ్యాక్సిన్‌ ‌సరఫరా విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. గుజరాత్‌ ‌తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడారు. కొరోనా వైరస్తో ప్రపంచం అంతా అల్ల కల్లోలంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తి అవుతున్న మనకు సరిపడా సరఫరా కావడం లేదన్నారు. మనవద్ద ఉత్పత్తి చేస్తున్న దాంట్లో కొంతయినా మనకు సరఫరా కాకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. వ్యాక్సిన సరఫరాపై ఎప్పటికప్పుడు కేంద్రంతో చర్చిస్తున్నామని అన్నారు. మరోమారు మంత్రి హర్షవర్ధన్‌కు నివేదిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ ‌కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని  రాజేందర్‌ అన్నారు. కొరోనా మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామన్నారు. దేశంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌ప్రారంభమైందని.. ప్రజలంతా భయంతో ఉన్నారని తెలిపారు. 4 లక్షల రెమిడిసివర్‌ ఇం‌జక్షన్లకు ఆర్డర్‌ ఇచ్చామని.. 21,500 ఇంజక్షన్లు మాత్రమే వచ్చాయని మంత్రి వెల్లడించారు. రెమిడిసివర్‌ ‌విషయంలో కేంద్రం షాక్‌ ఇచ్చిన్లటైందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి సరిపడా కొరోనా డోసులు లేవన్నారు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నామన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా కేటాయింపులపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమిడిసివర్‌ ఇం‌జక్షన్లను కేంద్రం పరిధిలోకి తీసుకుందని..  కేంద్రం తీరు చాలా బాధాకరమన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి కేటాయింపులు చేయాలని కోరారు. ఆక్సిజన్‌ ‌ట్యాంకర్ల కొరత ఇబ్బందిగా మారిందని మంత్రి పేర్కొన్నారు.

రెమిడిసివర్‌ ‌బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు. ఇకపోతే తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్‌ ‌కొరత లేదని, కొందరు ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీకి పంపుతున్నారని అన్నారు. బ్లాక్‌లో ఆక్సిజన్‌ ‌సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఆక్సిజన్‌పై ఐఏఎస్‌ ‌ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది.తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్‌ ‌మేమే వాడుకుంటాం అనొచ్చు..కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా లేదని మంత్రి స్పష్టం చేశారు. గాంధీలో కొరోనా పేషెంట్లకు అవసరమైన అందుతోందని తెలిపారు. కొరోనా ఉధృతి దృష్ట్యా తెలంగాణ ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్ద ఈటల రాజేందర్‌ ‌విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కొరోనా తీవ్రత అధికంగా ఉందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గ్రావి•ణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినప్పటికీ అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. ఇక మహారాష్ట్రకు అనుకొని ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు.

ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఏ ఆపదొచ్చినా తెలంగాణ ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సోషల్‌ ‌మీడియాలో వచ్చే వార్తలను నమ్మి ఎవరూ భయాందోళనకు గురికావొద్దని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. టెస్టుల విషయంలో మంత్రి మాట్లాడుతూ .RTPCR చేయడానికి 104 కేంద్రాల్లో 30 వేలపరీక్షలు చేస్తున్నాం. మిగిలినవి అన్నీరాపిడ్చేస్తున్నాం. అవసరం అయితే రోజుకు 2 లక్షలపరీక్షలు కూడాచేస్తాం. రాపిడ్లోపాజిటివ్‌ అనివస్తేకచ్చితంగా పాజిటివ్‌, ‌కాబట్టి లక్షణాలు లేనివారుఅందరూ హోమ్‌ఐసోలేషన్‌ ‌లోఉండాలి.ఒకవేళలక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌ ‌కి వచ్చి పరీక్షచేయించుకోవాలి, ఏంకాదు అనిఇంట్లో ఉంటేవారికి  •వైరస్ఎ తీవ్రత ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు వెంటిలేటర్‌ ‌దొరకడం,దొరికిన బ్రతకడం కష్టంఅవుతుంది. కాబట్టి తాత్సారం చేయవద్దు..అని సూచించారు.ప్రైవేట్‌ ‌హాస్పిటల్స్ ‌లోకూడా చికిత్స అందించేందుకు 1120 హాస్పిటల్‌ ‌కిఅనుమతిఇచ్చాము..ఈ హాస్పిటల్స్ ‌కొంతమందిని చివరిక్షణంలో గాంధీకి పంపిస్తున్నారు అలా పంపించవద్దు. కొంతమందికార్పొరేట్‌ ‌హాస్పిటల్స్ ‌వాళ్ళుడబ్బులు కట్టలేని వారిని చివరిదశలో గాంధీకిపంపిస్తున్నారు. ఇలా ఈ సమయంలోశవాలమీదపేలాలుఏరుకునే లాగావ్యవహరించవద్దు..అని అన్నారు..ఆక్సిజన్‌ ,‌మందులను బ్లాక్‌ ‌లో అమ్మవద్దు..ఇలాంటివారిపైఉక్కుపాదం మోపాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.‘చివరినిమిషంలో గాంధీకిపంపించడం వల్ల అక్క •వెంటిలేటర్‌ ‌బెడ్కి ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రస్తుతం 600 మందిపేషెంట్లు వెంటిలేటర్‌ ‌మీదఆక్సిజన్‌ ‌మీదఉన్నారు. ఇంతపెద్ద ఎత్తున మన రాష్ట్రమే ఆక్సిజన్‌ ‌ఫెసిలిటీ ఉన్న బెడ్స్ ఏర్పాటు చేసాము అన్నారు.ప్రస్తుతానికి ప్రభుత్వ దవాఖానాలలో ఆక్సిజన్‌ ‌కొరతలేదు.ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సి ఎస్‌ఆధ్వర్యంలో 10 మందిఐఏఎస్‌అధికారుల బృందం ఆక్సిజన్‌ ‌సప్లై,ఇంజెక్షన్‌ ‌ల పంపిణీ,వ్యాక్సినేషన్‌ ‌పంపిణీపై నిరంతరపర్యవేక్షణ చేస్తున్నారు. తెలంగాణ, దేశంలో మిగతారాష్ట్రాలతో పోలిస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది..ప్రజలుకూడా ఈ సమయంలో సహకరించాలి. అత్యవసరం అయితే  తప్పప్రయాణాలు పెట్టుకోవద్దు. పట్టణ ప్రాంతంలో ఎక్కువగా కేసులువస్తున్నాయి.

కేటీఆర్‌ ‌నాయకత్వంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ‌డిపార్ట్మెంట్‌ ‌పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. ప్రజలుఅనవసరంగా బెంబేలెత్త వద్దు..తెలంగాణ రాష్ట్రంలో నమోదుఅవుతున్న కేసుల సంఖ్యను బట్టి ఇక్కడికి ఇంజక్షన్లు కేటాయింపు కాకుండా.. అంతర్జాతీయ పేషెంట్లు, వివిధరాష్ట్రాల పేషెంట్‌ ‌కూడా హై దరాబాద్‌ ‌కు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ ఇంజక్షన్లు , ఆక్సిజన్‌ ‌కేటాయించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నాము..రెమిడీస్‌ ‌వేర్‌ఇం‌జెక్షన్లను కేంద్రానికి 150 రూపాయలకు, రాష్ట్రాలకు నాలుగువందలరూపాయలకు , ప్రైవేటు హాస్పిటల్స్ ‌కు ఆరువందలరూపాయలకు ఇవ్వడం కరెక్ట్ ‌కాదు.దేశప్రజలందరికీ కాపా బాధ్యత కేంద్రం మీద ఉంది.రేట్లలో ఇంతవ్యత్యాసం ఉంటుందా? ఈ సమయంలో  ఇలా వ్యవహరించవచ్చా? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం సంకుచితంగా ఆలోచించవద్దు అని కోరారు.

Leave a Reply