Take a fresh look at your lifestyle.

రాష్ట్రాల అభివృద్ధ్దికి.. సహకరించని కేంద్రం: మంత్రి కేటిఆర్‌

  • భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల కూటమికి అవకాశాలు
  • నాస్కామ్‌ ‌టెక్నాలజీ లీడర్‌షిప్‌ ‌ఫోరమ్‌ ‌సదస్సులో మంత్రి కేటిఆర్‌

Center for Development of States Minister KTR‌తెలంగాణ మోడల్‌ అభివృద్ధి దేశంలోని మిగతా రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచింది అని పరిశ్రమలు,ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహకారం చాలా తక్కువగా ఉందన్నారు. మేకిన్‌ ఇం‌డియా అంటున్న కేంద్రం.. రాష్టాల్రకు సహకరించడం లేదని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ముంబయిలో నిర్వహించిన నాస్కామ్‌ ‌టెక్నాలజీ అండ్‌ ‌లీడర్‌షిప్‌ ‌ఫోరమ్‌ 28‌వ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తన సొంత నిధులు ఇస్తుందన్న ఆలోచన సరికాదని, రాష్టాల్రు కూడా కేంద్రానికి నిధులు సమకూరుస్తుందన్న విషయం మరవకూడదని కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ నుంచి గడిచిన ఐదేళ్లలో రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నుల రూపంలో ఇస్తే తిరిగి తెలంగాణకు కేంద్రం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్టాల్రు కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులతో పోల్చుకుంటే.. కేంద్రం అన్ని నిధులను రాష్టాన్రికి తిరిగి ఇవ్వలేని విషయాన్ని గుర్తుంచు కోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబందు పథకాన్ని ఇతర రాష్టాల్రు అమలు చేస్తున్నాయి. రైతుబంధుతో తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ ‌రాష్ట్రంగా మార్చామని ఆయన తెలిపారు. ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఐటీ పరిశ్రమను జిల్లా కేంద్రాలకు విస్తరించామని చెప్పారు. టెక్‌ ‌మహీంద్ర లాంటి ప్రముఖ కంపెనీలు వరంగల్‌లో తమ శాఖలను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫార్మాక్లస్టర్‌ 19 ‌వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్‌ ‌వెల్లడించారు. వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న మెగా టైక్స్‌టైల్స్ ‌పార్క్ ‌దేశంలోనే పెద్దది అని తెలిపారు.అమెరికా, జపాన్‌ ‌లాంటి దేశాలు అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయన్నారు. ఆ దేశాలతో పోలిస్తే తెలంగాణ జీడీపీ చాలా మెరుగ్గా ఉందన్నారు.

 

ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ ‌వాటా కేవలం:
2 శాతం మాత్రమే మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని కేటీఆర్‌ ‌తెలిపారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్టాల్రను, లేదా ఇతర పార్టీలను శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదు. కేంద్రం చేపట్టిన అనేక చర్యలను అంశాల వారీగా మద్దతిచ్చిన మేం.. ప్రజా వ్యతిరేకమైన అసంబద్ధమైన చర్యలనూ వ్యతిరేకించాంఅని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి మంచి జరుగుతుంది.. సంపూర్ణ క్రాంతి వస్తుందన్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రం అన్న మాటలు నమ్మి మద్దతిచ్చాం. కానీ పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశానికి నష్టం జరిగిన విషయం తేలిన తర్వాత మా నిర్ణయం తప్పని తేలిందని కేటీఆర్‌ ‌వివరించారు. గత కొంతకాలంగా జరుగుతూ వస్తున్న ప్రతి ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో కచ్చితంగా ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇప్పటికే నిరాశ పరిచాయి. ఆర్థిక అభివృద్ధి, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దేశ ప్రజల ఆకాంక్షలను అందుకోలేకపోయాయి. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు’అని కేటీఆర్‌ ‌వివరించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy