Take a fresh look at your lifestyle.

రాష్ట్రాలను.. మోదీ సర్కార్‌ ‌వంచించింది

  • జిఎస్టీ బకాయిలు చెల్లించడంలో కేంద్రం విఫలం
  • నీట్‌పై సుప్రీమ్‌కోర్టుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్రాలు
  • పలు రాష్ట్రాల సిఎంలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్

‌కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం నాడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిహారం చెల్లించేందుకు కేంద్రం నిరాకరించడాన్ని తప్పుపట్టారు. ఇది రాష్ట్రాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వంచించడమేనని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల సీఎంలు, తమ భాగస్వాములుగా ఉన్న పశ్చిమబెంగాల్‌, ‌మహారాష్ట్ర, జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సోనియాగాంధీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్‌టీ బకాయిలు, జాయింట్‌ ఎం‌ట్రన్స్ ఎగ్జామ్‌ (‌జీ), నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎం‌ట్రన్స్ ‌టెస్ట్ (‌నీట్‌) (‌యూజీ) పరీక్షలకు సంబంధించిన అంశాలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ’కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మరో మూడు వారాల్లో పార్లమెంటు సమావేశం కానుది. ఆ కారణంగా మనమంతా పరస్పరం చర్చించుకుని, సహకరించుకోవాల్సి ఉంది. జీఎస్‌టీ పరిహారం చాలా పెద్ద అంశంగా కనిపిస్తోంది. పార్లమెంటులో ఆమోదించిన చట్టానికి అనుగుణంగా నిర్దేశిత కాలానికి పరిహారం చెల్సించాల్సి ఉంది. బకాయిలు పేరుకుపోతున్నాయి. అన్ని రాష్ట్రాలుఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి’ అని సోనియాగాంధీ ఈ సందర్భంగా అన్నారు.’ఆగస్టు 11న జరిగిన స్టాండింగ్‌ ‌కమిటీ ఆఫ్‌ ‌ఫైనాన్స్ ‌సమావేశంలో ప్రస్తుత సంవత్సరానికి చెల్లించాల్సిన 14 శాతం పరిహారం చెల్లించే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదని ఆర్థిక కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పారు. పరిహారం నిరాకరణ అనేది రాష్ట్రాలను, దేశ ప్రజలను మోదీ సర్కార్‌ ‌పూర్తిగా వంచించడమే అవుతుందని సోనియా ఘాటుగా విమర్శించారు. రాష్టాల్రతో పంచుకోనవసరం లేని ఏకపక్ష సెస్‌లతో కేంద్ర ప్రభుత్వం లాభపడుతూనే ఉందని అన్నారు. ఎగ్రికల్చరల్‌ ‌మార్కెటింగ్‌పై రాష్ట్రాలను సంప్రదించకుండా, ఎన్విరాన్‌మెంట్‌ ఇం‌పాక్ట్ అసెస్‌మెంట్‌ ‌నోటిఫికేషన్‌ ఇవ్వకుండా ఆర్డినెన్స్ ‌తేవడం అప్రజాస్వామికమని సోనియాగాంధీ అన్నారు. దశాబ్దాలుగా కల్పించిన పబ్లిక్‌ ‌సెక్టార్‌ ఆస్తులు అమ్మేస్తున్నారని, 6 విమానాశ్రయాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని, రైల్వేలను సైతం ప్రైవైటు పరం చేస్తున్నారని పేర్కొన్నారు.

నూతన విద్యా విధానం కూడా ప్రగతిశీల, సెక్యులర్‌, ‌శాస్త్రీయ విలువలకు విఘాతమని, విద్యార్థులు, పరీక్షలకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని సోనియాగాంధీ అన్నారు. మరోవైపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్‌ ‌వాయిదాకు ఉమ్మడిగా పోరాడాలని బీజేపీయేతర పాలిత ఏడు రాష్టాల్ర ముఖ్యమంత్రులు నిర్ణయించారు. దీనిపై సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించి సక్ష కోరాలని భావించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్‌ ‌మమతా బెనర్జీ కలిసి బుధవారం ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల ఆన్‌లైన్‌ ‌సమావేశాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ‌ఠాక్రే, జార్ఖండ్‌ ‌సీఎం హేమంత్‌ ‌సోరెన్‌తోపాటు నాలుగు కాంగ్రెస్‌ ‌పాలిత రాష్టాలసీఎంలు అమరీందర్‌ ‌సింగ్‌ (‌పంజాబ్‌), అశోక్‌ ‌గెహ్లాట్‌ (‌రాజస్థాన్‌), ‌భూపేశ్‌ ‌బాఘేల్‌ (‌ఛత్తీస్‌గఢ్‌) ‌వీ నారాయణస్వామి (పుదుచ్చేరి) పాల్గొన్నారు. సహకార వ్యవస్థ పేరుతో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం భ్రస్టుపట్టిస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో జేఈఈ, నీట్‌ ‌పరీక్షలు విద్యార్థులను మనోవేదనకు గురిచేస్తున్నాయని చెప్పారు. వాయిదా కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయిందని మమతా అన్నారు. విద్యార్థుల జీవితాలను ప్రమాదంలో పడేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. జేఈఈ, నీట్‌ ‌వాయిదా కోసం అందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు ప్రధాని మోదీ, రాష్ట్రపతిని కలుద్దామని జార్ఖండ్‌ ‌సీఎం హేమంత్‌ ‌సోరెన్‌ ‌సూచించగా మమతా దానికి అంగీకరించారు. అయితే ప్రధాని మోదీ మన విన్నపాన్ని పట్టించుంటారా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. కాగా జేఈఈ, నీట్‌ ‌పరీక్షలు నిర్వహించే పరిస్థితి తమ రాష్ట్రంలో లేదని సోరెన్‌ ‌చెప్పారు. విద్యార్థుల కోసం •టళ్లు, బస్సులు పునరుద్ధరిస్తే కరోనా వ్యాప్తి మరింతగా పెరిగేఅవకాశమున్నదని అన్నారు. దీనిపై కేంద్రమే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తన తల్లిదండ్రులిద్దరికి కరోనా సోకిందని హేమంత్‌ ‌సోరెన్‌ ‌తెలిపారు. మన సమస్యలన్నింటిపై ఉమ్మడిగా గళమెత్తుదామని ఆయన అన్నారు. జేఈఈ, నీట్‌ ‌వాయిదాకు సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ప్రతిపాదనకు పంజాబ్‌ ‌సీఎం అమరీందర్‌ ‌సింగ్‌ ‌మద్దతు తెలిపారు. తమ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నదని అన్నారు. కరోనా నియంత్రణకు సుమారు రూ.500 కోట్లు ఖర్చుచేసినట్లు ఆయన చెప్పారు. తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు. జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం చెల్లించలేదని ఆయన విమర్శించారు.

Leave a Reply