Take a fresh look at your lifestyle.

పేదలను ఆదుకోవడంలో కేంద్రం విఫలం : తమ్మినేని

ఖమ్మం మే 18,ప్రజాతంత్ర (ప్రతినిధి): ఖమ్మంలో సీపీఐ (ఎం) నాయకులపై పోలీసులు నమోదుచేసిన కేసులను ఉపసంహరించేలా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ‌ప్రభుత్వం, పోలీసు అధికారులు జోక్యం చేసుకోవాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం ఖమ్మంలోని సుందరయ్యభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ ఖమ్మంలో సీపీఐ (ఎం) నేతలపై పోలీసులు కేసులు నమోదు చెయ్యడాన్ని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఆదుకోవాలనీ, కార్డుల్లేని వారికి రేషన్‌ అం‌దించాలనీ, రైతుల ఇబ్బందులు తొలగించాని కోరుతూ శనివారం ఖమ్మంలో భౌతిక దూరం పాటిస్తూ, నిబంధనల మేరకు మాస్కులు ధరించి నిరసన తెలిసిన వారిపై చాలా అక్రమంగా కేసు పెట్టారనీ, ఇది దారుణమనీ సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకుని స్పందించి కేసులు ఉపసంహరించాలని తమ్మినేని డిమాండ్‌చేశారు. అదే రోజున బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తూ కార్యక్రమాలు చేపట్టినా, వారిపై కేసులు నమోదుచేయకుండా లాక్‌డౌన్‌ ‌నిబంధనలను పాటించిన సీపీఐ (ఎం) నేతలపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. వాస్తవానికి నిత్యం ప్రజల్లో ఉండే మా పార్టీ నేతలు ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఇలాంటి వారిపై కేసులు నమోదుచేయడం దారుణమన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం అంతా తామే చేస్తున్నామన్న నియంతృత్వ దోరణిని కలిగి ఉందన్నారు.

కోవిడ్‌ ‌నేపథ్యంలో అంతా కలిసి యుద్ధం చేయాలన్న అభిప్రా యం కలిగిలేదన్నారు. దేశంలో కాక, ప్రపంచంలోనే కేరళ రాష్ట్రం కోవిడ్‌ ‌నియంత్రణలో ఆదర్శంగా నిలుస్తోం దన్నారు. రాష్ట్రంలో తొలికేసు నమోదైనా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక ప్రణాళిక, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ, పంపిణీ వ్యవస్థ, వనరులను సధ్వినియోగం చేసుకునేలా రూ.20వేల కోట్ల విలువైన ఆర్దిక ప్యాకేజీని అమలుచేయడంతో కేరళలో కోవిడ్‌ను సమర్దవంతంగా నియంత్రించగలిగారన్నారు. మొదట చనిపోయిన నలుగురు తప్ప మరణాలు నమోదుకాలేదన్నారు. ముఖ్యంగా కేరళలో రాజకీయ పార్టీల మధ్య తేడాల్లేకుం డా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కరోనా ను నియంత్రించాయన్నారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మీడియా సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతిపక్షనేత కూడా పక్కపక్కనే ఇద్దరూ కూర్చుని ప్రజలనుద్దేశించి ప్రసంగించడం గొప్పవిషయమన్నారు. రాజకీయాలకు అతీతంగా రాజకీయ ఐఖ్యత స్ఫూ•ర్తిని రగిలించారన్నారు. రోజుకు 4500 పాజిటివ్‌ ‌కేసులతో దేశంలో కరోనా వైరస్‌ ‌చాలా వేగంగా విస్తరిస్తోన్న పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందిం చాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగతా కొన్ని రాష్ట్రాలతో పోల్చితే బెటరుగానే ఉందన్నారు. ముఖ్యంగా 12కేజీల బియ్యం, రూ.1500 నగదు, పంట కొనుగోళ్లు, తదితర విషయాల్లో తెలంగాణ సర్కారు మెరుగ్గానే ఉందన్నారు. కానీ వాటి అమల్లో చాలా తప్పలు జరుగుతున్నా యన్నారు. మత్యకార్మికులు సుమారు రూ.8కోట్ల విలువైన చేపలు చెరువుల్లో పోశారనీ, చేపలు పట్టే సమయం వచ్చి, ఎండా కాలంపూర్తయ్యే దశలో మత్యకారులు చేపలు పట్టే అవకాశం లేక ఆవదేన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సెలన్‌, ‌కల్లుగీత, చేనేత, గొర్రెల కాపరులు, తదితర కార్మికుల లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వారికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటే బాగుం డేదన్నారు. లాక్‌డౌన్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, అసంఘటిత రంగ కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్న క్రమంలో కనీసం రూ.10లక్షల కోట్లకు తగ్గకుండా ప్రత్యేక బడ్జెట్‌తో నిధులు కేటాయించి ఆదుకోవాలని ప్రముఖ ఆర్దిక వేత్తలు అమర్త్యసేన్‌, అభిజిత్‌ ‌బెనర్జీ తదితర ఆర్దిక వేత్తలు కేంద్ర ప్రభుత్వా నికి సూచిస్తున్నా మోడీ, నిర్మలా సీతారామన్‌ ‌పట్టించుకో లేదన్నారు. సీపీఐ(ఎం) రెండు ప్రతాపాదనలను కేంద్రం ముందుం చుతోందన్నారు. అందులో ఒకటి తక్షణమే ఆకలితో ఉన్న కుటుంబాలకు రూ.7వేలు చొప్పున మూడు నెలలు, కుటుంబంలోని ప్రతీ సభ్యునికీ 10కేజీల చొప్పున ఆరు నెలల పాటు రేషన్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ గోడౌన్లలో 7.70కోట్ల టన్నులు మూలుగుతున్నాయనీ, వాటిలో 3కోట్ల టన్నలు పంచితే ఆరునెలల పాటు దేశాన్ని బతికించవచ్చా న్నారు. ఉపాధి హామీని పట్టణపేదలకు కూడా వర్తింపచేయాలన్నారు.

Leave a Reply