Take a fresh look at your lifestyle.

కళాతపస్వి కె విశ్వనాథ్‌ ‌మృతికి ప్రముఖలు సంతాపం

  • కళను విశ్వవ్యాప్తం చేశారన్న ఎపి సిఎం జగన్‌
  • ‌మాది గురుశిష్యుల బంధం అన్న చిరంజీవి
  • విశ్వనాథ్‌ ‌మృతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం…
  • తెలుగుజాతికి తీరని లోటని నివాళి

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ‌మృతికి చిత్రరగంతో పాటు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కళాతపస్వి మృతిపై ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌తీవ్ర దిగ్భ్ర్రాతిని వ్యక్తం చేశారు. తెలుగులో ఆల్‌ ‌టైమ్‌ ‌గ్రేట్‌ ‌సినిమా డైరెక్టర్లలో విశ్వనాథ్‌ అ‌గ్రస్థానంలో నిలిచారని అన్నారు. దిగ్గజ దర్శకుడు తన సినిమాలతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారని.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సంస్క•తికి, భారతీయ కళలకు గుర్తింపు తెచ్చారని కొనియాడారు. కె విశ్వనాథ్‌ ‌నిష్క్రమణ తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని..ఆయన మిగిల్చిన శూన్యాన్ని ఎప్పటికీ పూరించలేమని వైఎస్‌ ‌జగన్‌ ‌పేర్కొన్నారు.

‘ఊహించని షాక్‌..‌విశ్వానాథ్‌ను కోల్పోవడం భారతీయ, తెలుగు సినిమాకే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీర్చలేని లోటుగా మెగాస్టార్‌ ‌చిరంజీవి ట్విట్టర్‌ ‌వేదికగా ప్రత్యేక నోట్‌ ‌షేర్‌ ‌చేశారు. ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురుశిష్యుల సంబంధం. అంతకు మించి తండ్రీ కొడుకుల అనుబంధం. ఆయనతో గడిపిన సమయం నాకు అత్యంత విలువైనది’ అని కళాతపస్వి గురించి చిరంజీవి నోట్‌లో పేర్కొన్నారు.

విశ్వనాథ్‌ ‌మృతికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు సంతాపం…తెలుగుజాతికి తీరని లోటని నివాళి
హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : విశ్వనాథ్‌ ‌మృతికి తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ ‌మరణం పట్ల తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, ‌సత్యవతి రాథోడ్‌ ‌దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్‌ ‌మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం అందించాలని మంత్రులు ఆకాక్షించారు. దర్శక దిగ్గజం, కళాతపస్వి కే.విశ్వనాథ్‌ ‌పార్థీవదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌నివాళులర్పించారు. ఆయ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ అరుదైన దర్శకుడు కే.విశ్వనాథ్‌ అని మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. విశ్వనాథ్‌ ‌మృతిపట్ల మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, జగదీశ్‌ ‌రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. తెలుగుదనాన్ని, సంస్కతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్‌ ‌మృతి బాధాకరమని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశ్వనాథ్‌ను కోల్పోవడం తెలుగు ప్రేక్షకులకి, సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తెలుగు సంస్క•తి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. విశ్వనాథ్‌ ‌మృతి పట్ల మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులని చెప్పారు.

Leave a Reply