Take a fresh look at your lifestyle.

ఆయురారోగ్యాలతో ఉండాలి

పుట్టిన రోజున సిఎం కెసిఆర్‌కు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నేతల శుభాకాంక్షలు
కెసిఆర్‌ ‌తండ్రి కావడం గర్వంగా ఉందన్న కెటిఆర్‌
‌బల్కంపేటలో కవిత ప్రత్యేక పూజలు
తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన నేత అన్న హరీష్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 17 : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన దిన శుభాకాంక్షలు. చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్ధిస్తున్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ ‌చేశారు. ఆ తర్వాత ఫోన్‌ ‌చేసి కూడా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంతా బిస్వ శర్మలు కూడా సీఎం కేసీఆర్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు చెప్పారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సీఎంకు విషెస్‌ ‌తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వి•రు సదా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. వి•రు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు.  68వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్‌కు శాసనసభ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌ ‌కుమార్‌, ‌మంత్రి పువ్వాడ అజయ్‌, ఇతర మంత్రులు, ఎంఎల్‌ఏలు, నటులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ ‌తదితరులు ఉన్నారు.

కెసిఆర్‌ ‌తండ్రి కావడం గర్వంగా ఉందన్న కెటిఆర్‌…‌బల్కంపేటలో ప్రత్యేక పూజలు చేసిన కవిత
సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా నాయకుడు..నా తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్‌ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా మార్చుకున్నారని కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందరిని ముందుకు నడిపిస్తారని అన్నారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కునే సత్తా కేసీఆర్‌కు ఉందని తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘నా నాయకుడు.. నా తండ్రి..అని’ గర్వంగా పిలుచుకుంటానని మంత్రి కేటీఆర్‌ ఎమోషనల్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జన్మదినం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు. సీఎం కేసీఆర్‌ ‌బర్త్‌డేను పురస్కరించుకొని మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం అవి•ర్‌పేటలోని గురుద్వారలో మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన నేత అన్న హరీష్‌
‌సీఎం కేసీఆర్‌ 68‌వ పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల కేసీఆర్‌ ‌వల్లే నెరవేరిందని, భావి తరాల బంగారు తెలంగాణ ఆయనవల్లే సాధ్యమవుతుందని అన్నారు. వి• జన్మదినం తెలంగాణకు పండుగరోజు అని చెప్పారు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నదిని ట్విటర్‌లో పోస్ట్ ‌చేశారు.

 

Leave a Reply