Take a fresh look at your lifestyle.

పీవీ కి గౌరవం తెచ్చేలా ఉత్సవాలు:కెకె

హైదరాబాద్: మాజీ ప్రధాని పీ వీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నేడు అధికారికంగా ప్రారంభించనుంది .. హైదరాబాద్ నెక్ల్ స్ రోడ్, పీ. వీ. జ్ఞాన భూమి లో ఉదయం 10.30 ని.పుష్పాంజలి తో ప్రారంభమై 10.45 కు భజన సంకీర్తనలు, 11 గం .సర్వమత ప్రార్థనలు, 11.45 ని. సభాకార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిధి గా ఉత్సవాలను ప్రారంభించనున్నారు . ఉత్సవ కమిటీ కన్వీనర్ , రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు ఈ సందర్బంగా మాట్లాడుతూ ..‌నెహ్రూ తర్వాత పీవీనే అత్యంత విజయవంతమైన ప్రధాని అని టీఆర్‌ఎస్‌ ‌నేత కేశవరావు కొనియాడారు. దేశం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో క్లిష్టంగా ఉన్నప్పుడు.. పీవీ నరసింహారావు చక్కదిద్దారని గుర్తుచేశారు.

పంజాబ్‌లాంటి సమస్యలను పీవీ పరిష్కరించారని తెలిపారు. పీవీకి జరిగినన్ని అవమానాలు ఎవరికీ జరగలేదని, ప్రధానిగా పనిచేసిన వ్యక్తి భౌతికకాయాన్ని ఏఐసీసీ ఆఫీసులోకి రానివ్వలేదని చెప్పారు. పీవీ నరసింహారావు తెలంగాణ బిడ్డ అని, ఆయనలోని మరోకోణాన్ని ప్రపంచానికి తెలియజేయాలని, శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కేకే ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌పెద్దల ఒత్తిడితో పీవీకి అవమానం జరిగిందని, అయితే తాను పేరు చెప్పనని, ఆ విషయాలు ప్రజలందరికీ తెలుసన్నారు. పీవీ పేరుతో ఓ పథకం, మ్యూజియం ప్రారంభించే యోచన ఉన్నట్లు వెల్లడించారు. ఆయన సమైక్యవాది అయినా తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు ఎత్తిచూపారని గుర్తుచేశారు. దక్షిణాదిపై ఈర్ష్యతోనే పీవీకి సరైన గుర్తింపు రానివ్వకుండా చేశారని కేశవరావు ఆరోపించారు.

Leave a Reply

error: Content is protected !!