Take a fresh look at your lifestyle.

నేరాలను నియంత్రించడంలో సిసి కెమెరాలు కీలకం: సిపి

నేరాలను నియంత్రించడంతో పాటు నేరస్టులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలకంగా నిలుస్తున్నా యని వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో హన్మకొండ పోలీసులు నూతనంగా నెలకొల్పిన సిసి కెమెరాలను బుధవారం సిపి ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగం గా నేరాల నియంత్రణకు సిసి కెమెరాల ప్రాధాన్యతపై హన్మకొండ పోలీసుల పిలుపునందుకోని హన్మకొండ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుండి హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్ళే ప్రధాన మార్గంతో పాటు, ఆర్టీసీ బస్టాండ్‌లోని ప్రతి ఫ్లాటఫాంతో పాటు బస్టాండ్‌ ‌పరిసర ప్రాంతాలు, లక్ష్మీపురంలో ప్రజల భాగస్వామ్యంతో నూతనంగా 40 సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వీటన్నింటిని హన్మకొండ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌కంట్రోల్‌ ‌రూంకు అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

సిసి కెమెరాలను ప్రారంభించిన అనంతరం సిపి మాట్లాడుతూ ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసుల తో సమానమని, ప్రస్తుతం నేరాలను పరిష్కరించడంలో సిసి కెమెరాలో నమోదైన దృష్యాల ఆధారంగా నేరస్థులను గుర్తించడంతో పాటు, నేరం జరిగిన తీరును తెలుసుకోవడం సులభమవుతోందని, అదేవి ధంగా నేర దర్యాప్తులోను సిసి కెమెరాలోని దృశ్యాలు ప్రధాన సాక్ష్యంగా నిలవడంతో పాటు నేరానికి పాల్పడిన నేరస్థుడికి శిక్షపడటంలో ఈ సాక్ష్యం కీలకంగా పరిగణించడబడు తోందన్నారు. రానున్న రోజుల్లో ట్రై సిటీ పరిధిలో ప్రజల భాగస్వామ్యంతో నెలకొల్పబడిన సిసి కెమెరాలను వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌కార్యాలయములోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌రూంకు అనుసంధానం చేయడంతో పాటు, ఇక్కడి నుండి సిసి కెమెరాలను పర్యవేక్షించబడుతుందని, ముఖ్యంగా ట్రై సిటి పరిధిలోని అన్ని ప్రధాన వ్యాపార సముదాలతో పాటు ప్రజల రద్దీగా వుందే వ్యాపారం జరుపుకునే ప్రాంతాల్లో సంబంధిత వ్యాపారస్థులు తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల న్నారు. ప్రస్తుతం కమిషనరేట్‌ ‌పరిధిలో 32వేల సిసి కెమెరాలను ఎర్పాటు చెయడం జరిగిందని, రానున్న రోజుల్లో లక్ష కెమెరాలను ఎర్పాటు చేసేందుకు ప్రణాళిక ను రూపొందించబడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజీనల్‌ ‌మేనేజర్‌ ‌శ్రీధర్‌, ‌సెంట్రల్‌ ‌జోన్‌ ఇం‌చార్జ్ ‌డిసిపి పుష్పా, హన్మకొండ ఎసిపి జితేందర్‌ ‌రెడ్డి, హన్మకొండ ఇన్‌స్పెక్టర్‌ ‌దయాకర్‌, ‌డివిజనల్‌ ‌మేనేజర్లు శ్రీదేవి, శ్రీనివాసరావు, డిపో మేనేజర్‌ ‌తో పాటు హన్మకొండ ఎస్‌ఐలు, డిపో మేనేజర్లు ఇతర పోలీస్‌ ‌సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply