Take a fresh look at your lifestyle.

సిబిఎస్‌ఈ ‌టెన్త్ ‌పరీక్షలు రద్దు..

  • 12వ తరగతి పరీక్షలు వాయిదా
  • కొరోనా తీవ్ర విజృంభణతో కేంద్రం కీలక నిర్ణయం

‌దేశవ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌తీవ్ర విజృంభణ కొనసాగుతోన్న నేపథ్యంలో త్వరలో జరగబోయే సెంట్రల్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యూకేషన్‌(‌సీబీఎస్‌ఈ) ‌పరీక్షల పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వొచ్చే నెలలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిషాంక్‌ ‌తెలిపారు. అలాగే, 12వ తరగతి పరీక్షలను మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా వెల్లడించారు. కొరోనా విజృంభణ కారణంగా వివిధ స్థాయిల్లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న ఎగ్జామ్స్‌పై బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ ‌పోఖ్రియాల్‌, ‌పీఎం ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ, క్యాబినేట్‌ ‌సెక్రటరీ, హయ్యర్‌ ఎడ్యూకేషన్‌ ‌సెక్రటరీ, వివిధ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల శ్రేయస్సు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని చెప్పారని, మంత్రి రమేశ్‌ ‌పోఖ్రియాల్‌ ‌తెలిపారు. ఈ విద్యా సంవత్సరని పరగణనలోకి తీసుకుంటూనే, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారన్నారు. ‘‘మే 4 నుంచి దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ ‌పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం దేశంలో కొరోనా విజృంభణ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. 11 రాష్ట్రాల్లో స్కూళ్లను మూసివేయబడ్డాయి’’ అని తెలిపారు. సీబీఎస్‌ఈ ‌సిలబస్‌ ‌దేశ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. మే 4 నుంచి జూన్‌ 14 ‌వ వరకు జరగనున్న 10 వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు వెల్లడించారు.

బోర్డు రూపొందించే ఆబ్జెక్టీవ్‌ ‌క్రైటీరియా ఆధారంగా రిజల్టస్ ‌ప్రకటించనున్నట్టు తెలిపారు. ఏ విద్యార్థి అయిన మార్కుల కేటాయింపుపై అభ్యంతరం ఉంటే, కొరోనా పరిస్థితులు చక్కబడ్డ అనంతరం పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, 12వ తరగతి ఎగ్జామ్స్‌ను మాత్రం వాయిదా వేస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. జూన్‌ 1 ‌న కొరోనా పరిస్థితులను సమీక్షించి, అనంతరం ఎగ్జామ్స్ ‌షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలకు 15 రోజులు ముందుగానే తేదీలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Leave a Reply