Take a fresh look at your lifestyle.

హత్య పై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ కోమటిరెడ్డి

‌బంగారు తెలంగాణలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ ‌పై మండిపడ్డారు. నార్కట్‌పల్లిలో ఎంపీ కోమటిరెడ్డి వి•డియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్ట్ అడ్వకేట్‌ ‌దంపతుల దారుణ హత్యను ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. న్యాయవాద దంపతుల హత్య పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

- Advertisement -

రాష్టంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను అడ్డు తొలగించుకోవడానికి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ హత్యలకు కూడా వెనుకాడటం లేదని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. ఒక మండల స్థాయి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు ఉదయం కేసీఆర్‌ ‌పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మధ్యాహ్నం న్యాయవాదుల హత్యలో పాల్గొనడం దారుణమని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున తాను త్వరలో పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా కలియ తిరుగుతానని ఆయన తెలిపారు. ఈ పాదయాత్రలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్టంలో అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ అని పేరు చెప్పి రాష్టాన్ని్ర హత్యలతో భ్రష్టు పట్టిస్తున్నారని కేసీఆర్‌పై ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించే రోజులు దగ్గర పడ్డాయని ఎంపీ వెంకట్‌రెడ్డి అన్నారు.

Leave a Reply