Take a fresh look at your lifestyle.

వామన్‌రావు దంపతుల హత్యపై సిబిఐ విచారణ

  • పుట్టమధుకు సిఎం కెసిఆర్‌కు సన్నిహిత సంబధాలు
  • తెరసాకు తొత్తులుగా మారిన పోలీస్‌ అధికారులు
  • గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కాంగ్రెస్‌ ‌నేతలు

‌పెద్దపల్లి జిల్లాలో న్యాయవాది వామనరావు దంపతులను నడిరోడ్డుపైన విచక్షణారహితంగా దుండగులు హత్య చేసిన ఘటనను సిబిఐతో దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. ఈ హత్యలపై కాంగ్రెస్‌ ‌నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యలనుఁ నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్‌ ‌తమిళిసైను కలిసి కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వి•డియాతో మాట్లాడుతూ.. పోలీస్‌ ‌కమిషర్‌ ‌తెరాస నాయకులకు తొత్తులుగా మారిపోయారని ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. పోలీసుల పాత్ర డైరెక్ట్‌గా లాయర్ల హత్యలో ఉందని, స్థానిక పోలీసుల విచారణలో నిజం బయటకు రాదనీ, కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు. కోర్టు పరిశీలనలో సీబీఐ విచారణ జరగాలని అన్నారు. లాకప్‌ ‌డెత్‌ ‌కేసులో లాయర్లను పోలీసులే బెదిరించారని, కోర్టులో ఇది రికార్డ్ అయ్యిందని తెలిపారు.

లాయర్ల హత్యను న్యాయవ్యవస్థపై దాడిగా చూస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కనీసం లాయర్ల డిమాండ్‌ను కూడా పట్టించుకోవడం లేదని ఉత్తమ్‌ ‌విమర్శించారు. లాయర్‌ ‌వామనరావు చనిపోతూ పుట్టా మధు పేరు కూడా చెప్పినట్లు స్థానికులు చెప్పారని, పుట్టా మధు సీఎంకి దగ్గర కావడంతో పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. కాళేశ్వరం పనులు మొదలయ్యాక పుట్టా మధు ఇసుక మాఫియా కొనసాగిస్తున్నారని ఉత్తమ్‌ ‌మండిపడ్డారు. లాయర్‌ ‌వామన్‌రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హత్య జరిగినా కనీసం ఖండించలేదన్నారు. శుక్రవారం ఉదయం గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ ‌నేతలు.. హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే లాయర్‌ ‌దంపతులు అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారన్నారు.

ఓ కేసు నిమిత్తం హైకోర్టులో కేసు వేసినందుకే వీరిని చంపారని, పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ ‌నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పుట్టా మధుకు స్థానిక పోలీస్‌ ‌కమిషనర్‌ ‌తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని, స్థానిక పోలీసులతో కేసు ముందుకు సాగదన్నారు. నేరుగా కోర్టు ద్వారా విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని ఆయన వెల్లడించారు. ఈ హత్య ఘటనపై సీజేఐ, బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా, రాష్ట్రపతికి లేఖ రాసామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఘటన న్యాయవ్యవస్థకే హెచ్చరికలా ఉందని వ్యాఖ్యానించారు. అక్రమ మార్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ‌ట్రస్ట్‌కు నిధులు సమకూర్చుతున్నారని, న్యాయవాదులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే న్యాయవాద దంపతులను హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసులో ట్రస్ట్ ‌నిర్వాహకులను ఎందుకు వొదిలేశారని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, న్యాయవాదుల హత్యకు కారణం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని ఆరోపించారు. ఈ హత్యలో టీఆర్‌ఎస్‌ ‌పెద్దల ప్రోత్సాహం ఉందని, హత్యలను సీఎం కేసీఆర్‌ ‌కనీసం ఖండించక పోవడం దారుణమని మండిపడ్డారు.

న్యాయవాదుల హత్యలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని జీవన్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు మాట్లాడుతూ..కేసీఆర్‌ ‌జన్మదినం రోజున న్యాయవాదుల హత్య చేయడం చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. శీలం రంగయ్య లాకప్‌ ‌డెత్‌పై వామన రావు దంపతులు హైకోర్టులో పిల్‌ ‌వేశారని, ఆ పిల్‌ని ఉపసంహరించుకోవాలని వొత్తిడి చేశారని న్యాయవాదులు పిల్‌లో పేర్కొన్నారు. కోర్టు నుంచి వారికి రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలించినా.. న్యాయవాదులకు ఎందుకు రక్షణ కల్పించలేదు..పోలీసుల చేతకాని తనం వల్లే హత్య జరిగిందని మండిపడ్డారు. స్థానిక పోలీసులతో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగదని, పెద్దపల్లి పోలీసుల వి•ద తమకు నమ్మకం పోయిందని..అసలైన దోషులనే కఠినంగా శిక్షించాలని శ్రీధర్‌ ‌బాబు డిమాండ్‌ ‌చేశారు.

లాయర్‌ ‌వామన్‌రావు దంపతుల హత్య చాలా బాధాకరమని ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా అందరూ బాగుండాలని కోరుకున్నాం. కానీ గుంజపడుగు గ్రామానికి చెందిన ఇద్దరు లాయర్ల హత్య జరగడం దురదృష్టకరమన్నారు. శీలం రంగయ్య అనే దళితుడు లాకప్‌ ‌డెత్‌పై వామన్‌రావు దంపతులు కోర్టులో కేసు వేశారన్నారు. స్థానిక పోలీస్‌ ‌కమిషనర్‌ ‌పట్టించుకోవడం లేదని.. కోర్టు పట్టించుకోవాలని వారు కోరారని, కానీ వారికి ప్రాణాలే పోయాయని పేర్కొన్నారు. రామాలయం భూమి, అంతకుముందు రెండు మూడు ఘటనలకు లింక్‌ ‌పెడుతున్నారని, కేసును నీరుగార్చే ప్రమాదం ఉందన్నారు. టెక్నాలజీ పెరిగిందని కేటీఆర్‌ ‌చెబుతున్నారని, ఆ సెల్‌ ‌టవర్‌ ‌కింద ఉన్న ఆ రోజు డేటా ఎందుకు కలెక్ట్ ‌చేయలేదని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply