Take a fresh look at your lifestyle.

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం

  • నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయంపై సిబిఐ దర్యాప్తు
  • హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన మంత్రి కాకాణి
  • కాకాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలన్న సోమిరెడ్డి

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. త్వరలోనే సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 13‌న నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ ‌సివిల్‌ ‌జడ్జి కోర్టులో ఓ చోరీ జరిగింది. కొన్ని కీలకమైన ఫైళ్లు మాయం కావడం అప్పట్లో కలకలంరేపింది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు ఈ కేసును సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ దొంగతనం కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా జరగడం లేదని.. అందుకే స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే మంచిదని.. అప్పుడే వాస్తవాలు బయటపడతాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఓ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా సుమోటో పిల్‌గా పరిగణించి.. మొత్తం 18 మందిని ప్రతివాదులుగా హైకోర్టు చేర్చింది. టీడీపీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ ‌రెడ్డిపై అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ ‌రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు.

సోమిరెడ్డికి విదేశాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయని.. కొన్ని పత్రాలను డియాకు విడుదల చేశారు. వెంటనే స్పందించిన చంద్రమోహన్‌ ‌రెడ్డి కాకాణిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కాకాణి విడుదల చేసిన డాక్యుమెంట్లు ఫేక్‌ అని ఛార్జ్‌షీట్‌ ‌ఫైల్‌ ‌చేశారు. ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్‌లో నెల్లూరులోని కోర్టులో చోరీ జరిగింది. నెల్లూరులో ఉన్న కోర్టు సముదాయంలో 4వ అదనపు జ్యుడిషియల్‌ ‌మేజిస్ట్రే ‌కోర్టు కూడా ఉంది. ఈ క్రమంలో కోర్టులో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడినట్లు కోర్టు సిబ్బంది గమనించారు. చోరీ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఈ దొంగతనం కేసులో.. కోర్టు నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్టాన్రిక్‌ ‌వస్తువులు తీసుకువెళ్లారని ఆరోపణలు వచ్చాయి. కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాయం అయ్యాయని గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఫైళ్లు మాయం కావడంపై సోమిరెడ్డి, కాకాణి గోవర్థన్‌ ‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

దీంతో తాను సీబీఐ విచారణకైనా సిద్ధమని గోవర్థన్‌ ‌రెడ్డి అన్నారు. తర్వాత హైకోర్టులో విచారణ జరగ్గా.. ఇప్పుడు సీబీఐకు ఈ కేసు విచారణను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగనుంది. ఇదిలావుంటే నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు మంత్రి కాకాణి గోవర్ధన్‌ ‌రెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి డియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణ జరపాలని నేను అఫిడవిట్‌ ‌దాఖలు చేశాను. టిడిపి అధినేత చంద్రబాబులాగా స్టేలతో తప్పించుకోవాలని చూడలేదు. నాపై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో నిజాలు నిగ్గు తేలుతాయి. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విచారణలు ఎదుర్కోవాలి. నెల్లూరు కోర్టులో చోరీ కేసుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ ‌రెడ్డి నిప్పులు చెరిగారు.

కాకాణికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. సోమిరెడ్డి డియాతో మాట్లాడుతూ..నెల్లూరు కోర్టులో దస్త్రాల అపహరణ కేసును సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఘోరమైన నేరాలు చేసే కాకాణిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పిన్లటైంది. సీబీఐ తమ విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నా. మాయమైన దస్త్రం ఫిర్యాదుదారుడిని నేనే కాబట్టి నా అభిప్రాయమూ సీబీఐ తీసుకోవాలి. వివేకా హత్య కేసులా నాన్చకుండా, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠగా ఈ కేసును సీబీఐ తీసుకోవాలి. జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారుల్ని తప్పించి.. న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో నాపై కాకాణి చేసిన అసత్య ఆరోపణలపై నేనే కాకాణి ద కేసు పెట్టా. కాకాణి చూపించింది తప్పుడు పత్రాలని విచారణలో తేలి ముగ్గురు అరెస్టయ్యారు. కేసు కీలకదశలో ఉండగా కాకాణి మంత్రి అవ్వటం.. మరుసటి రోజే కేసు దస్త్రాలు పోవటం జరిగింది. కోర్టులో ఉన్న 4 వేల దస్త్రాల్లో ఒక్క కాకాణి దస్త్రమే కుక్క అరుపులు వల్ల పోయిందని పోలీసుల ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సోమిరెడ్డి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Leave a Reply