Take a fresh look at your lifestyle.

కొరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్‌

‌కరోనా వైరస్‌ ‌కోవిడ్‌-19 ‌వ్యాప్తి చెందకుండా అరికట్టుటకు ముందస్తు జాగ్రత్తలు సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశించారు. శుక్రవారం కోవిడ్‌-19 ‌వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా ఏంపిడిఓలు, తహశీల్దార్లు, పిహెచ్‌సి, పోలీస్‌ అధికారులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ‌పోలీస్‌ ‌కమిషనర్‌, ‌జిడబ్లుఏంసి కమిషనర్‌తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ ఈ దశలో వైరస్‌ ‌వ్యపించాకుండా నియత్రించకుంటే వైరస్‌ అరికట్టుటకు మన నుండి కాదని అందుకు మీకు వేరే పని లేదని దీని పైనే ప్రత్యేక దృష్టి సారించాలని నిర్లక్ష్యం అజాగ్రత్త వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ ‌హెచ్చరించారు. అందుకు గ్రామీణ పట్టణ ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి మార్చి 1వ తేదీ నుండి జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వారి వివరాలను సర్వే చేసి శనివారం సాయంత్రం వరకు పూర్తి నివేదిక అందజేయాలని దానికి సంభందించిన ప్రోఫార్మ అందజేయడం జరుగుతుందని చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారు ఇప్పుడు ఉన్న ప్రదేశం, గ్రామం కంటే ముందు యేక్కడెక్కడికి వెళ్లారో ఎవ్వరెవ్వరిని కలిశారో, ఏయే వాహనాలు ద్వారా రవాణా మార్గం ద్వారా పర్యటించారో అట్టి వివరాలను కూడా అందజేయాలని, వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిజేయని పక్షంలో ఇంటిప్రక్కన ఉన్న కుటుంబ సభ్యులు ద్వారానైన తెలుసుకొని గ్రామంలో కొత్తవారు ఎవ్వరూ వచ్చిన సమాచారం పొందే విధంగా నెట్‌ ‌వర్క్ ఉం‌డాలన్నారు. వ్యక్తిని14 రోజుల పాటు సపరేటుగా ఒక గదిలో ఐసోలేషన్‌ ‌వార్డులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

వారిని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ నియమించిన నోడల్‌ అధికారి (పిహెచ్‌సి డాక్టర్‌) ఒకరిని నియమిస్తారని, ఈ నోడల్‌ అధికారి ప్రతి రోజూ వెళ్లి అట్టి వ్యక్తిని పరిశీలన చేయాలన్నారు. ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి నియమాలు పాటిస్తున్నారో లేదో ఇంటి ప్రక్క గల వారి నుండి సమాచారం వచ్చే విధంగా కృషి చేయాలని మండల తహశీల్దార్లు, ఏంపిడిఓలు పోలీస్‌ అధికారి కూడా పర్యవేక్షించి నివేదిక ప్రతి రోజు అందజేయాలని ఆదేశించారు. శరీరంలో గల ఏ అవయం ద్వారా లిక్విడ్‌ ‌ద్వారానైనా ప్రభావితం అయ్యే అవకాశం ఉందన్నారు. విదేశాల నుండి వచ్చిన వారు తప్పని సారిగా సమాచారం అందించాలని అందు కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో 7993969104 హెల్ప్ ‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు ఈ హెల్ప్ ‌లైన్‌ 24 ‌గంటల పాటు పనిచేస్తుందని చెప్పారు. జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా చేయడమే కాకుండా ఆ ప్రదేశాలలో ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టెన్త్ ‌పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల్లో సానిటైసెడ్‌ ‌చేయలని అవరమైతే సబ్బులను ఏర్పాటు చేయాలన్నారు.

గ్రామ పంచాయతీ నిధులతో సోడియం హైపోక్లోరైడ్‌ ‌సొల్యూషన్‌ ‌కొనుగోలు చేసి పరీక్ష కేంద్రాల్లో కుర్చీలు బెంచిలపై అదేవిధంగా జన సమూహ ప్రదేశాలలో పిచికారి చేయలన్నారు. దేవాలయాలు ప్రార్థన మందిరాలు ఫంక్షన్‌ ‌హాలులో జన సమీకరణ లేకుండా కృషి చేయాలన్నారు. కరోనా వ్యాధిపై వదంతులు ఫేక్‌న్యూస్‌ ఎవ్వరైనా పోస్ట్ ‌చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఉద్యోగులు కూడా ఫేక్‌ ‌న్యూస్‌ ‌పోస్ట్ ‌చేస్తున్నారని, ఉద్యోగులు అని కూడా చూడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌విశ్వనాథ్‌ ‌రవీందర్‌ ‌మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున అట్టి ఉత్తర్వులను తప్పకుండా పాటించాలని అన్నారు. వ్యాధి వ్యాపించకుండా అందరూ చిత్త శుద్దితో కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ఇంతకుముందు ఫంక్షన్‌హలు బుక్‌ ‌చేసుకున్న వారికి అనుమతి ఉందని ఫంక్షన్‌ ‌హాలుకు 200 మంది కంటే ఎక్కువగా ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ‌వరంగల్‌ ‌మహానగర పాలక సంస్థ కమిషనర్‌ ‌పమేలా సత్పతీ, జేసీ దయానంద్‌, ‌జిల్లా వైద్య ఆరోగ్య శాఖఅధికారి డాక్టర్‌ ‌లలితాదేవి, డిపిఓ మహిమూద్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply