Take a fresh look at your lifestyle.
Browsing Category

కవితా శాల

తరగతి గది

పాఠాలు జెప్పే సార్లం పిల్లవాని కళ్ళలోకి జూసి కష్టం సుఖం తెలుసుకొని మనసు బాగా లేక మనాదిల బడ్డొళ్ళను మందలించి తరగతి గదిని పాఠానికి సంసిద్దులుగా చేసేవాళ్ళం భిన్న మస్తిష్కాల పుట్టలాఉండే తరగతి గదిలో పాఠం జెప్పడమంటే ఆటవిడుపా అది ఓ…

మా ఇంటి సందుకు అడ్డంగా కంచె, కొరోనా నీతి సూత్రం మా ముందుంచె …

కాకతీయ కలగూర గంప (ముసలి ‘‘ముచ్చట్ల’’ చద్దిమూట)... అది ఒకప్పటి ఫైర్‌ ‌స్టేషన్‌ ‌ప్రక్క  సందు మట్టి  బాట, కరెంట్‌ ‌లేని ఇండ్లు 60 ఏండ్ల క్రితం విద్యుత్తులేని రోజుల్లో ధగాధగా మెరిసింది అడుగు మీద అడుగు వేసి నడిస్తే  ఈ చివర నుండి ఆ చివరకు…

స్నేహ కుసుమం

స్నేహకుసుమాలు నేడెందుకో స్వార్థపరిమళాల్ని వెదజల్లుతూ మనసు విప్పడం మానేసి మనసు విరవడం మొదలెట్టాయి అడిగిందిచ్చినోడే ఆప్తుడవుతుండు లేదన్నోడు నిందలుమోస్తూ నిస్తేజమౌతున్నడు స్నేహసమూహాలన్నీ అహం నింపుకుని ఏర్పాటువాదంవై…

ఒక్క అడుగు పడలే

శిల్పి ముడిరాయిని చెక్కి ప్రాణంపోస్తే నాయకులు బతుకున్న మనుషుల్నే మూటలగడ్తున్నరు ఆరిపోతున్న దీపాలకు సమురుపోసి ఆరోగ్యాలను నిలబెట్టండంటే ప్రతిదినం ఓ కొత్తభాషనే ప్రతి నాయకుడు ఓ భాషా శాస్త్ర వేత్తనే పంటచేల్లో కలుపు పెరిగినట్లు మాటలు…

మిమ్ములను ఏం మరిసిపోరు

వ్యాక్సిన్‌ ‌వస్తుందన్న కల ఇప్పట్లో నెరవేరే ఆశ కనబడటం లేదు బతుకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ కుదురుగా కూర్చోనీయడంలేదు పదుల నుండి వేల సంఖ్యకు  మారిన మహామ్మారి ఇంకను ప్రాణాలకు భరోసా ఇవ్వని యంత్రాంగం సర్వ శక్తులను వైద్యంపై మోహరించి…

దాశరథి యాదిలో

దాశరథి నిజాం నిరంకుశ పాలనపై అక్షర తూటాలను అగ్నిధారలా సంధించిన సవ్యసాచి రుద్రవీణలు మీటీ రౌద్రాన్ని తట్టిలేపి గడ్డిపోసలతో కత్తులు బట్టించిన ఘనాపాటి జైలు గోడల మధ్య జడపు మరిచి నవాబు బూజు దులిపిన  ధీరత్వం. అక్షరాలు అగ్ని కణికలై…

మౌనరోధన

మనసెందుకో మౌనంగానే లోలోపల రోదిస్తుంది రోజురోజుకు మనుషులు తమకుతామే విచక్షణ మరచి విచ్ఛలవిడితనాన్ని చూపుతుండ్రు పెనుతుఫానులా ధరణిపై దావాణంలా కనిపించకుండా దహనం చేస్తుంది కొరోనా కాలనాగు విషాగ్నులు కుమ్మరిస్తూ మరణమృదంగం మోగిస్తుంది…

గుడిసెలు

గుడిసెలెక్కడ జూసిన మనసులో ఎన్నో ఆలోచనలు రేగుతయి. గుడిసెలెక్కడ కనబడ్డ గుండె దస్సుమంటది నేను ఎదిగి వచ్చిన మూల స్తంభం. గుడిసెలు చెమట క్షేత్రాలు ప్రగతి చక్రాలు. గుడిసెల జూసి నప్పుడు మనిషి ముఖ కవళికలు కుల వర్గ అంతర్ముఖాన్ని…

తిరగబడిన ప్రపంచంలో

విత్త ప్రపంచపు కొత్త వాకిళ్ళలో ఎక్స్ప్రెస్‌ ‌హైవేలు, స్కై వేలు, మల్టీ లేయర్‌ ‌ఫ్లై ఓవర్‌ ‌లు, నింగిని తాకే టవర్స్, ‌మెట్రో పిల్లర్‌, ‌గ్లోబల్‌ ‌సిటీ, స్మార్ట్ ‌సిటీ, గ్రీన్‌ ‌సిటీ హై టెక్‌ ‌సొగసులు అంతర్జాతీయ ప్రమాణాల రహదారులు,…

ప్యాకేజీల ఫలహారం

నిన్నటి దాకా ఇంట్లో ఉంటేనే బతుకుతమన్నారు ఇప్పుడేమో బతుకు బండి లాగాలంటే బయటపడక తప్పదన్నారు ముప్పు ముంచుకొస్తున్న తప్పించుక తిరిగేటోడే గొప్పోడని అంటున్నడు నూకలు రూకలు నిండుకొని రేపటికెట్లనె బెంగతో ఎవరి సావు వారికొదిలి తాళాలు…