Take a fresh look at your lifestyle.

కులాల రాజకీయాలు

దేశంలోను, రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు,రాజకీయ క్రమశిక్షణ అవసరం. కులరహిత సమాజాం కోసం పాటుపడాల్సిన పాలకులు, రాజకీయ నేతలు కులాల కుంపట్లను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలు మొత్తం కులాల చుట్టే తిరుగుతున్నాయి. ఇందుకోసం కులాల వారీగా పథకాలు ప్రకటిస్తున్నాయి. అయితే నగదు బదిలీలు, లేదా ఇతర తాయిలాలు ప్రకటించడం దారుణం కాక మరోటి కాదు. రాజకీయ పార్టీలన్నీ బిసిల ఎజెండా అంటూ వల్లె వేస్తున్నాయి. ఏ కులం అయినా మరచిపోయామా  అని దివిటీ పెట్టి వెతుకుతున్నాయి. రాజకీయాలు వేరు..అభివృద్ది వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా హుందాగా ఉండాలి. రాజకీయాల్లో వ్యక్తిగత విద్వేషాలకు తావు ఉండరాదు. గుదిబండగా మారిన పథకాలను ఎప్పటికైనా సక్షించి  అందుకు తగు నిర్ణయం తీసుకోవాలి.నిరంతరాయంగా  డబ్బుల పందేరం లేదా పథకాలో డబ్బులు పంచడంతో వోట్లు  పొందాలన్న ఎత్తుగడలను ఇక ఎంతమాత్రం కొనసాగించరాదు. ఈ డబ్బుల పందేరాన్ని అభివృద్దిగా చూపి ప్రచారం చేసుకోవడం కూడా సరికాదు. జగన్‌ ‌కూడా అదే ధోరణితో ఉన్నారు. అదే పనిగా పందేరం పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. డబ్బులుపంచడమే అభివృద్ది అన్న నినాదం ఎత్తుకున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు.

ఈ విషయంలో ఇకనైనా జగన్‌ ‌తీరు మారాలి. మౌళిక సదుపాయాలు కల్పించడం, సౌకర్యాలు కల్పించడం, ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడం ముఖ్యం కావాలి. అభివృద్ధి నమూనా మారకుంటే రాష్ట్రం అధోగతి  పాలుకాక తప్పదు. ఈ విషయాలను గుర్తించి ప్రాంతీయ పార్టీలు పాలన సాగించాలి. అలాగే ప్రజాస్వామ్యంలో నిరంకుశ విధానాలను ఎవరు అవలంబించినా పతనం తప్పదు. అది గుర్తించకపోతే మనుగడ సాగించడం కూడా అంతే కష్టం. ప్రజల మనసెరిగి ముందుకు సాగితే ఎంతకాలమైనా ప్రజలు ఆదరిస్తారు. అప్పుల భారం పెరుగుతున్న క్రమంలో ఉచితపథకాలను తగ్గించుకోవడం ద్వారా ప్రజలపై భారం పడకుండా చూడాలి. తెలుగు రాష్టాల్రను తీసుకుంటే రూపాయికి కిలో బియ్యం పథకాన్ని సక్షించుకోవడం.. లేదా బియ్యం ధరలను పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే జనాభాను మించి తెల్లకార్డులు ఉన్నాయి. వీటిని సక్షించాలి. బియ్యం ధరలు కనీసం పదిగా నిర్ణయించాలి. ఇది ఎపికి కూడా వర్తిస్తుంది. కుటుంబ సర్వే ప్రకారం అర్హుల జాబితాను గుర్తించాలి. అలాగే రైతుబంధు జాబితాను కూడా మళ్లీ సక్షించాలి. బడాభూములున్న వారికి, తోటలు, బంజరు భూములున్న వారికి రైతుబంధు సాయం అందకుండా చూడాలి. పథకాలతో ప్రజలను మచ్చిక చేసుకోవచ్చేమో కానీ అదే అభివృద్ది అని నమ్మించడం సరికాదు. తాగు,సాగునీటితో పాటు, విద్యుత్‌, ‌రోడ్డు వసతులను సంపూర్ణంగా అభివృద్ది చేయాలి. విద్యావైద్య రంగాలకు కేటాయింపులు పెంచి వసతులను మెరుగు పరచాలి. నిరుద్యోగ సమస్య మొత్తంగా పరిష్కరించకున్నా ఉపాధి అవకాశాలను పెంచాలి.

తెలంగాణలో కాంగ్రెస్‌, ‌బిజెపిలను అణగదొక్కడంలో కెసిఆర్‌ ఎలాంటి వెనకడుగు వేయలేదని రాష్ట్ర రాజకీయాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌, ‌టిడిపిలు తెలంగాణలో ఉనికి లేకుండా పోవాలని కెసిఆర్‌ ‌వేసిన ఎత్తుగడలు ఫలించాయి. ఆయన దెబ్బకు టిడిపి ఉనికిలేకుండా పోయింది. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్లపాటు రాజ్యమేలారు. తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించు కోలేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ది ముసుగేసారు. కానీ అక్కడా మమతా బెనర్జీ లాంటి వారు పుట్టుకొచ్చారు.. కమ్యూనిస్టులను కూకటి వేళ్లతో పెకిలించారు. అయితే ఆమె  కూడా అదే ధోరణిలో నిరంకుశ పాలన సాగించడంతో ఇప్పుడు మమతా బెనర్జీ పునాదులు కూడా కదులుతున్నాయి. బిజెపి అక్కడ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు. నిరాశా నిస్ప•హ లతో ఉన్న మమతా బెనర్జీ బిజెపి నేతలపై దాడులకు దిగుతోంది. గత ఎన్నికల్లో గెలిచినా బిజెపి కూడా బలంగానే ఉందని ఉనికిని చాటింది. తెలంగాణల కూడా తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీని కోలుకోకుండా దెబ్బతీసిన కేసీఆర్‌, ఇప్పు‌డు బీజేపీ రూపంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి వొస్తుందని ఊహించి ఉండకపోవచ్చు.

పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్‌ అదే తప్పు చేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో బలంగా ఉన్న వామపక్షాలను మమతా బెనర్జీ బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ప్రత్యామ్నా య శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. అసెంబ్లీలో ఒక్క సీటు కాస్తా మూడుకు పెరిగింది. బీజేపీ ఇంతలా బలం పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీల తరఫున ఎవరైనా ఏ ఎన్నికల్లోనైనా గెలిస్తే వారిని తమ పార్టీలోకి కలిపేసుకుంటూ వొచ్చిన కేసీఆర్‌ ‌బీజేపీకి చెందిన వారిని మాత్రం ఆకర్షించలేక పోయారు. అలాగే వారికి పునాదే లేదన్న ధోరణి ప్రదర్శించారు. కానీ ప్రజల్లో నిరసనలు నివురుగప్పితే నాయకుడు ఏ పార్టీలో అయినా పుట్టుకుని వొస్తారని గమనించలేదు. కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి ఇదే ప్రధాన కారణం. తెలంగాణ బిజెపిలో ఇప్పుడు నాయకత్వం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌నిజామాబాద్‌ ఎం‌పీ ధర్మపురి అర్వింద్‌ ‌దూకుడు పెంచి టీఆర్‌ఎస్‌ను తమ ఉచ్చులోకి లాగారు. ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో టీఆర్‌ఎస్‌ ‌నాయకత్వం విఫలమైంది. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉందన్న ఆరోపణలు పెరిగాయి. క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా డియాను దూరం పెట్టారు. కేసీఆర్‌ ‌చిన్నపాటి విమర్శను కూడా స్వీకరించలేని స్థితికి చేరుకున్నారు.కర్ణాటకలో  తాజాగగా బిజెకి పట్టిన గతే ఏ రాష్ట్రంలో అయినా..ఏ పార్టీకైనా పట్టడం ఖాయం.
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply