Take a fresh look at your lifestyle.

కుల నిర్మూలనే బి.ఆర్‌. అం‌బేద్కర్‌ ఆశయం

“అం‌బేద్కర్‌ ‌జీవితం వైవిధ్యమైనది. కుల వ్యవస్థ వ్యతిరేకపోరాటం, కుల వ్యవస్థ అధ్యయనానికి, రాయడానికి సమయం వినియోగించారు. గ్రామీణ స్వయం పోషక,ఆర్థిక వ్యవస్థకు కుల వ్యవస్థే మూలమైనందువల్ల వెనుకబడిన ఉత్పత్తి విధానం మారాలని, పట్టణీకరణ,పారిశ్రామికీకరణ పెరగాలని కోరుకున్నారు. కులం పునాదుల మీద జాతిని గానీ, దేశాన్ని గానీనిర్మించలేరని అన్నారు. మన రాజ్యాంగం, రాజ్యాంగ సమానత్వాన్ని మాత్రమే ప్రసాదించింది.ఆర్థిక, సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధించలేమని అంబేద్కర్‌ ‌సూచించారు.”

(నేడు డా।। బి.ఆర్‌. అం‌బేధ్కర్‌ 64 ‌వర్ధంతి)

కుల నిర్మూలనే బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ ఆశయంకులంవల్లఆర్థిక శక్తియుక్తులు సమకూడవు, జాతి వికాసమూ జరగదు కానీ కులం హిందువులను చిన్నాభిన్నం చేసింది. కులాలు కూటమిగా ఏర్పడలేవు. ఒక కులం మరొ కులానికి అనుబంధంగా ఉండదు. కులవ్యవస్థ అందరూ పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్నిఆటంకపరుస్తుంది. కులాలది స్వయంప్రతిపత్తి. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులనుకలుపుకోకుండా కులమే అడ్డుపడుతుంది. ఈ భావాలను విస్తృతంగా వివరించి కులవ్యవస్థ నుంచీసమాజాన్ని దూరం చెయ్యడమే అంబేడ్కర్‌ ఆశయం.

భీంరావ్‌ ‌రాంజీ అంబేడ్కర్‌ 1891 ‌సంవత్సరం ఏప్రిల్‌ 14‌న నాటి సెంట్రల్‌ ‌ప్రావిన్సెస్‌ ‌సైనిక స్థావరం మహోమ్‌ ‌గ్రామంలో రాంజీ మలోజీ సాక్పాల్‌ , ‌భీమా భాయ్‌ ‌దంపతుల 14వ, చివరి సంతానంగా జన్మించారు. వారిది మరాఠీ నేపథ్యం. మహార్‌ ‌కులానికి చెందినవారు. ఈస్ట్ ఇం‌డియా సైన్యం లో అంబేద్కర్‌ ‌పూర్వీకులు పనిచేశారు. భారత సైనిక స్థావరం బ్రిటిష్‌ ‌సైన్యంలో ఆయన తండ్రి పనిచేశారు. బీమ్‌ ‌రావును క్రమశిక్షణతో పెంచారు. బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌భారతదేశపు ఆరుగురు మేధావుల్లో ఒకరు అని ప్రసిద్ధ రచయిత బెవేర్లి నికోలస్‌ ‌ప్రశంస లందుకున్నారు. సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా, ప్రఖ్యాతి గాంచిన బి.ఆర్‌ అం‌బేద్కర్‌ 1956, ‌డిసెంబర్‌ 6‌న కన్నుమూసారు.

భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రజాస్వామ్య పర్యవేక్షకుడిగా, సంఘసంస్కర్తగా మహామేధావిగా ప్రసిద్ధి పొందిన డాక్టర్‌ ‌భీమ్‌ ‌రావు అంబేద్కర్‌ ‌స్మృతి కి నివాళులర్పిస్తూ భారత ప్రభుత్వం ఆ మహనీయునికి మరణాంతరం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం. కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడిగా, దళితుల విమోచకుడిగా, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా, మహిళల హక్కుల పరిరక్షణ కోసం పోరాడిన సంస్కర్త అంబేడ్కర్‌ ‌జీవితం నేటికీ స్ఫూర్తిగా వెలుగొందుతున్నది. స్వాతంత్య్రం సంపన్నులకు, అగ్రకులాల ఆధిపత్యానికి కాకుండా దేశంలో దళిత, ఆదివాసీలకు, సగభాగమైన మహిళలకు రావాలని ఆయన అహిప్రాయపడ్డారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా తన భావాలు, అభిప్రాయాలను ప్రచారం చేసేందుకు పత్రిక అవసరమని భావించి 1927లో ఏప్రిల్‌ 3‌వ తేదీన ‘‘బహిష్కృత భారత్‌’’ ‌పత్రికను పోరాట ఆయుధం చేసుకున్నారు.

దేశంలో అధికారంలో వున్న సంఫ్న్ ‌పరివార్‌ ‌శక్తులకు అంబేడ్కర్‌ ‌భావజాలం, ఆచరణ పెద్ద ఆటంకంగా మారి, దళితులపై దాడిచేసి వారిని లోబర్చుకోవటం, అంబేద్కర్‌ ‌భావాలు వక్రీకరించి మాట్లాడటం నిత్య కృత్యమైంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత బలహీనవర్గాలపై దాడులు పెరిగాయి. మద్రాస్‌ ఐఐటీలో ‘’ అంబేడ్కర్‌ – ‌పెరియార్‌’’ ‌స్టడీ సర్కిల్‌పై, హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్శిటీ రోహిత్‌ ‌వేములపై, ఇలా నిత్యం దళితులపై దాడులు సాగుతునే ఉన్నాయి. ‘‘కులవివక్ష ఇంకా కోనసాగుతున్నదని విద్యావంతులు, మేధావులు అంగీకరించడానికి సిద్దంగాలేరని దళిత నేత ఉదిత్‌ ‌రాజ్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ,రిజర్వేషన్లు తొలగించి అసమానతలను పెంచుతున్నదని ఉదిత్‌ ‌రాజ్‌ ఆరోపించారు.

ఆధునిక భారతదేశ కుల వ్యవస్థ, జాతి సామాజిక సమూహాలమీద వర్ణం అని పిలువబడే నాలుగు సైద్ధాంతిక విధానాల మీద ఆధారపడి ఉంది. 1901 నుండి డెసినియలుసెన్ససు ప్రయోజనాల కోసం చతుర్వర్ణ ఉపవర్గాలుగా వర్గీకరించారు. సాంఘిక ప్రాధాన్యత ద్వారా వర్గీకరణ గుర్తించారని అన్నారుబీ వాస్తవానికి కొన్ని నిర్దిష్ట కులాలు విభజన ఆధునిక సృష్టి అని తెలుస్తోంది. వ్యక్తమవుతున్నాయి. సైద్ధాంతికభారతీయ కులవ్యవస్థలో ఉపవిభాగాలని భావిస్తున్నారు. ఈ వర్ణ వ్యవస్థ సమాజాన్ని బ్రాహ్మణులు (పండితులు, యజ్ఞ పూజారులు), క్షత్రియులు(పాలకులు, యోధులు), వైశ్యులు (రైతులు, వ్యాపారులు, చేతివృత్తుల వారు), శూద్రులు ( కార్మికులు) గా విశదీకరించింది. జాతి మూలాలు వర్ణవ్యవస్థ సమాజంలో ఎప్పుడూ క్రియాశీలకం కాదని మేధావులనమ్మకం. జాతి మూలాలు, వృత్తులు, భౌగోళిక ప్రాంతాల వరకు మారవచ్చు. జాతులు ఎటువంటి స్థిరసోపానక్రమం లేకుండా జీవనశైలి, సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతుల ఆధారంగా వ్యక్తీకరించబడిన వర్గీకరణ అస్పష్టమైన భావనలకు లోబడి ఉంటాయి.

దేశంలోని అనేక ప్రధాన సామ్రాజ్యాలు, మౌర్యులు,శాలివాహనులు, చాళుక్యులు, కాకతీయులు వంటి అనేకవంశాలు వ్యవస్థలో శూద్రులుగా వర్గీకరించబడ్డాయి. 9వ శతాబ్దం నాటికి బ్రాహ్మణులు, వైశ్యులతోసహా నాలుగు కులాల రాజులు వర్ణ సిద్ధాంతానికి విరుద్ధంగా భారతదేశ రాచరిక వ్యవస్థలో అత్యున్నతస్థానాన్ని ఆక్రమించారు. ఆచరణలో జాతీయుల వర్ణ తరగతులకు, ప్రముఖ జాతులకు అన్వయించక పోవచ్చు,ఉదాహరణకు యాదవులలో రెండు వర్ణాలు ఉన్నాయి. అంటే క్షత్రియులు, వైశ్యులు. కుల వ్యవస్థను నిలబెట్టాలని చూస్తున్న హిందూ మత భావజాలాన్నిబట్టబయలు చేసేందుకు కుల వ్యవస్థ రుపు మాపేందుకు అంబేడ్కర్‌ ‌చివరి వరకూ ప్రయత్నించారు. హిందూ మతం ఉన్నంత వరకు సమాజంలో కుల వ్యవస్థ,అస్పృశ్యత ఉండి తీరతాయని, దాని నుండి బయటపడితేనే దళితులు విముక్తి చెందుతారని అంబేద్కర్‌విశ్వసించారు.

కుటుంబ వ్యవహారాలలో మత జోక్యం చేసుకోకూడదనిభావించారు. కానీ అంబేడ్కర్‌ ‌ముస్లింలకు వ్యతిరేకంగాచెప్పారని ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టు న్నది. హిందూ మతంలో మహిళలు హింసకు గురవుతు ండడాన్ని గుర్తించి మనువాదం నుంచి మహిళలు విముక్తి పొందాలని ఆయన కోరుకున్నారు. ఆ లక్ష్యం కోసం ఆయన మంత్రి పదవి కూడా వదులు కున్నారు. అంబేద్కర్‌ను ఆర్‌ ఎ• •ఎ• •‌హిందూ ధర్మకర్తల జాబితాలో చేర్చింది. 1946లో అంబేడ్కర్‌ ‌ను రాజ్యాంగ రచనా సంఘం చైర్మన్‌గా నియమించిన రోజున నిరసన వ్యక్తం చేసింది. రాజ్యాంగమంటే మనుస్మృతి అని, ఈ దేశానికి రాజ్యాంగంగా మనుస్మృతిని గుర్తించాలని డిమాండ్‌ ‌చేసింది.దానికోసం దేశ త్రివర్ణ పతాకాన్ని కూడా ఆమోదించకుండా, జనగ ణమణ గేయాన్ని ఆలపించకుండా ఆందోళనచేసింది. వివేకానందుడు సైతం కులం హిందూమతానికి రాచపుండు అని అభివర్ణించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ‌దేశంలో కుల నిర్మూలన కావాలని ఏనాడూ పోరాడలేదు. కానీ నేడు అంబేడ్కర్‌ ‌తనవాడంటూ దళితులను, దేశప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నది. కుల రహిత సమాజంలో ప్రవేశించడానికి సమర్థవంతమైన మార్గాలు,సాధనాల్లో కులాంతర వివాహం ఒకటి. మహాత్మా గాంధీ దళితులతో కులాంతర వివాహాలకు పట్టుబట్టిమరీ సమర్ధించారు.‘కుల నిర్మూలన కు కులాంతర వివాహాలు ముఖ్యమైన చర్యగా అంబేద్కరు కూడా ప్రయత్నించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కులాంతర జంటలకు నగదు ప్రోత్సాహకాలు, బంగారు పతకాలను కూడా అందించాయి.’’కులాంతర వివాహాలు వాస్తవానికి జాతీయ ప్రయోజనాలకు సంబంధించినవి, ఎందుకంటే అవికుల వ్యవస్థను నాశనం చేస్తాయి’’ అని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది.

అంబేద్కర్‌ ‌జీవితం వైవిధ్యమైనది. కుల వ్యవస్థ వ్యతిరేకపోరాటం, కుల వ్యవస్థ అధ్యయనానికి, రాయడానికి సమయం వినియోగించారు. గ్రామీణ స్వయం పోషక,ఆర్థిక వ్యవస్థకు కుల వ్యవస్థే మూలమైనందువల్ల వెనుకబడిన ఉత్పత్తి విధానం మారాలని, పట్టణీకరణ,పారిశ్రామికీకరణ పెరగాలని కోరుకున్నారు. కులం పునాదుల మీద జాతిని గానీ, దేశాన్ని గానీనిర్మించలేరని అన్నారు. మన రాజ్యాంగం, రాజ్యాంగ సమానత్వాన్ని మాత్రమే ప్రసాదించింది.ఆర్థిక, సామాజిక సమానత్వం లేకుండా రాజకీయ సమానత్వం సాధించలేమని అంబేద్కర్‌ ‌సూచించారు.

sangani malleswaram
డా।। సంగని మల్లేశ్వర్‌
‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌, 9866255355

Leave a Reply