Take a fresh look at your lifestyle.

రేపట్నుంచి నగదు తీసుకోవచ్చు

జిల్లాలో కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల మహిళల జన్‌ధన్‌ ‌యోజన పథకం ద్వారా నేరుగా వారి వారి ఖాతాల్లోనే 500జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయనమాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్‌ ‌కళ్యాణ్‌ ‌యోజన పథకం క్రింద, ప్రధానమంత్రి మహిళా జన్‌ధన్‌ ‌యోజన పథకం క్రింద లబ్దిదారుల ఖాతాల్లో 500రూపాయలను జమచేయడం జరిగిందని అన్నారు. జూన్‌ 5‌వ తారీఖు నుండి డ్రా చేసుకునే సదుపాయం కల్పిండం జరిగిందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ ‌వ్యాప్తి నేపధ్యంలో అకౌంట్‌ ‌నెంబర్‌ ‌చివరి సంఖ్య 1 లేదా 0 ఉన్న వారికి జూన్‌ 5‌న, అలాగే చివరి సంఖ్య 2,3 ఉన్నవారు 6వ తేదీన, 4,5ఉన్న వారు 8వ తేదీన, చివరి సంఖ్య 8,9వ నెంబర్‌ ఉన్నవారు ఈ నెల 10వ తేదీన విత్‌ ‌డ్రా చేసుకోవాలని జిల్లా లీడ్‌ ‌బ్యాంక్‌ ‌మేనేజర్‌ ‌జగదీశ చంద్రబోస్‌ అన్నారు.

విత్‌‌డ్రా చేసుకోవడానికి వచ్చే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. పోస్ట్ ఆఫీస్‌లలో, బిసి పాయింట్ల వద్ద, సిఎస్‌పిల వద్ద, ఏటిఎం ఔట్లెట్స్ ‌వద్ద కూడా నగదు డ్రా చేసుకునే సదుపాయం ఉందన్నారు. పైన ప్రకటించిన తేదీల్లో వెళ్లకపోతే జూన్‌ 11 ‌నుండి ఎప్పుడైన తమ డబ్బులని డ్రా చేసుకోవాలని సూచించారు. డబ్బులు డ్రా చేయలేని యెడల వారి అకౌంట్లలో జమ అయి ఉంటుందే కాని, ఎట్టి పరిస్థితుల్లో అవి వెనుకకు ప్రభుత్వానికి పోదని అన్నారు.

Leave a Reply