Take a fresh look at your lifestyle.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు జిల్లా వ్యాప్తంగా రెండు నెలల్లో 850 కేసులు: డిఎస్పీ

Drinking alcohol in public places is wrong DSP Nageswara Rao

సూర్యాపేట: మద్యం ప్రియులు సరదా కోసమో, సమయం ఉన్నదో అనుకొని స్నేహితులతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించారో పోలీస్‌ ‌కేసులు తప్పవు. దిశ సంఘటన జరిగినప్పటి నుండి జిల్లాలో ఎస్పి ఆదేశాల మేరకు డిఎస్పి ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కోరడా జులిపిస్తున్నారు. నేడు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.దీనిలో భాగంగా కొద్ది రోజులుగా జిల్లాలో, పట్టణంలోని గ్రామీణ ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై దృష్టి సారించి కేసులు నమోదు చేయడంతోపాటు కోర్టులో జరిమానాలు విధిస్తున్నారు. రెండు నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా 850కేసులు నమోదు చేసి కోర్టు జరిమాన ద్వారా సుమారు 5లక్షల రూపాయలు వసూలు చేశారు. మరి ఎక్కువగా యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి ఎక్కువగా యువతనే మద్యం సేవిస్తు పట్టుబడుతున్నారు. ఒక ప్రక్క పోలీసులు నిత్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా యువత నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని పోలీసులు కోరుతున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవు : డిఎస్పి నాగేశ్వరరావు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రతి రోజు పెట్రోలింగ్‌ ‌నిర్వహిస్తు కేసులు నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దృష్టి సారించామని వెల్లడించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు కోసం పాటుపడాలని సూచించారు. దీనిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయడంతో పాటు జరిమాన విధించడం జరుగుతుందని హెచ్చరించారు. దీనిపై ప్రత్యేక టీములను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం జరుగుతుందని వెల్లడించారు.నిరంతంరం పెట్రోలింగ్‌, ‌స్ఫెషల్‌ ‌టీమ్స్ ‌పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Leave a Reply