Take a fresh look at your lifestyle.

బండి సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు

  • ధృవీకరించిన వరంగల్‌ ‌సిపి రంగనాథ్‌
  • ‌పాలకుర్తిలో హెల్త్ ‌చెకప్‌..‌వాహనాలు మారుస్తూ తరలింపు
  • అరెస్ట్ ‌తీరుపై భగ్గుమన్న బిజెపి శ్రేణులు
  • పలు చోట్ల అందోళనలతో ఉద్రిక్తత..పోలీసుల లాఠీఛార్జ్

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : ‌బిజెపి అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టును వరంగల్‌ ‌సీపీ రంగనాథ్‌ ‌ధృవీకరించారు. మొత్తం మూడు కేసులు నమోదు చేశామనిచెప్పారు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్‌ ‌హస్తం ఉన్నట్లు నిర్దారించారు. వాటి ఆధారంగానే మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పకడ్బందీగా నాన్‌బెయిలబుల్‌ ‌కేసులు నమోదు చేశారు. కమలాపూర్‌ ‌స్టేషన్‌లో కేసును నమోదు చేశారు. మొత్తం వ్యవహారాన్ని వి•డియా ముందు సీపీ రంగనాథ్‌ ఉం‌చనున్నారు. అంతకు ముందు బండి సంజయ్‌ ‌తరలింపుపై స్పష్టత రాలేదు. ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై పోలీసులు నోరు మెదప లేదు. భారీ బందోబస్తు మధ్య కార్లను మారుస్తూ బండి సంజయ్‌ను పోలీసులు తిప్పారు. అయితే జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరిన బండి సంజయ్‌ ‌కాన్వాయ్‌ను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు లాఠీచార్జ్ ‌చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి.

బండి సంజయ్‌ను మరో వాహనంలోకి మార్చి అక్కడి నుంచి తరలించారు. వరంగల్‌ ‌హైవే నుంచి జనగామ సర్వీస్‌ ‌రోడ్డుకు బండి సంజయ్‌ ‌కాన్వాయ్‌ను మళ్లించారు. బండి సంజయ్‌ను పాలకుర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పదినిమిషాల అనంతరం బండి సంజయ్‌ను అక్కడి నుంచి తరలించారు. వాహనాలను మార్చి మార్చి బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు. అయితే ఆయనను ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై తెలియకుండా జాగ్రత్త పడ్డారు.. బండి సంజయ్‌ ‌తరలింపులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీజేపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పాలని కమలం పార్టీ శ్రేణులు డిమాండ్‌ ‌చేశారు. ఇదే క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తిలోని ప్రైమరీ హెల్త్ ‌సెంటర్‌ ‌వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీ ఛార్జ్ ‌చేసి.. అరెస్ట్ ‌చేశారు. బండి సంజయ్‌కి పాలకుర్తి వైద్య  పరీక్షలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలియడంతో.. స్థానిక బీజేపీ నాయకులు హాస్పిటల్‌ ‌దగ్గరకు చేరుకుని ఆందోళన చేయడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. వారిని పోలీసు వాహనాల్లో పీఎస్‌కు తరలించారు.

పోలీసుల లాఠీ చార్జ్‌లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలైయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ ‌చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేసారు. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్‌ ‌దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన్ను అకారణంగా అరెస్టు చేశారని,  ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బండి సంజయ్‌ ‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేసారు. ఈ సందర్భంగా నిర్మల్‌ ‌జిల్లాలోని బైంసా, జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్టపల్లి, మంచిర్యాల జిల్లా, వరంగల్‌ ‌జిల్లాలోని వర్దన్నపేట, నర్సంపేటలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

Leave a Reply