Take a fresh look at your lifestyle.

బిజేపి నాయకులపై పెట్టిన కేసులను కొట్టి వేయాలి

నెన్నెల ఎస్సైని వెంటనే సస్పెండ్‌ ‌చేయాలి : బెల్లంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ కొయ్యల ఏమాజి 

మందమర్రి, ఏప్రిల్‌ 27, ‌ప్రజాతంత్ర విలేఖరి: భారతీయ జనతా పార్టీ నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌ ‌గ్రామానికి చెందిన బిజేపి పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోగు సురేందర్‌, ‌గోగు సుధాకర్‌పై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న నెన్నెల ఎస్సై రమాకాంత్‌ ‌ని వెంటనే సస్పెండ్‌ ‌చేయాలని బిజేపి బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచా ర్జీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్‌ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎంపిటిసి ఎన్నికల సందర్భంగా బిజేపి పార్టీ నుండి ఎంపిటిసి అభ్యర్థిగా గోగు సురేందర్‌ ‌తల్లి పోటిచేయడం జరిగింది. ఈ గ్రామం స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్వగ్రామం కావడం వలన ఎస్సైకి ఆదేశాలు ఇచ్చి బిజేపి పార్టీ నాయకులపై అక్రమ కేసు లు పెట్టి, వేధించాలని ప్రోత్సహించడం శోచనీయమని అన్నారు. కోవిడ్‌ 19 ‌లాక్‌డౌన్‌ ‌సందర్బంగా హైదరాబాద్‌ ‌నుండి జెండా వెంకటా పూర్‌ ‌గ్రామానికి చెందిన కొందరు యువకులు స్వగ్రామానికి రావడం జరిగింది.

ఈ విషయం మండల రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్ళడం తో వారు 15రోజుల వరకు బయటకు రావద్దని వారిని హోమ్‌ ‌క్వారంటైన్‌ ‌చేయడ జరిగింది. కానీ సదరు వ్యక్తులు ఆదేశాలను పట్టించుకోకుండా గ్రామంలో తిరగడం జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఇలా బయట తిరగద్దు అని గోగు సురేందర్‌ అనే వ్యక్తి వారిని మందలించి మండల అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని వారు దృష్టిలో పెట్టుకోని ఇతనితో గొడవ పెట్టుకోని గోగు సురేందర్‌ ఇం‌టిపై దాడి చేయడానికి రావడం జరిగింది. ఈ విషయాన్ని గోగు సురేందర్‌ ‌స్థానిక ఎస్సై దృష్టికి తీసుకెళ్ళి వారిపై పోలీసు స్టేషన్‌లో రాత పూర్వకంగా ఫిర్యాదు కుడా చేయడం జరిగింది. కానీ సదరు ఎస్సై ఎమ్మెల్యే ప్రోద్భలంతో వారిపై కేసులు పెట్టకుండా ఫిర్యాదు దారుడిపై అక్రమ కేసులు బనాయించి, ప్రతి రోజు పోలీసు స్టేషన్‌కు రమ్మని, లేని యెడల రౌడీ షీట్‌ ‌తెరుస్తానని బేధించడంతోపాటు నానా అవస్థలకు గురిచేస్తున్నాడని, ఎస్సై టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులకు తొత్తుగా మారి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. బిజేపి నాయకులపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని వెంటనే అక్రమ కేసులు కొట్టేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సదరు ఎస్సైని సస్పెండ్‌ ‌చేయాలని కోరారు. ఈ విషయంపై వెంటనే స్పందించి డిసిపి ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి బెల్లంపల్లి రూరల్‌ ‌సిఐ జగదీష్‌కి ఫోన్‌ ‌చేసి ఈ కేసు పూర్తి విచారణ జరిపి త్వరగా నివేధిక సమర్పించాలని కోరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్‌, ‌రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెరబెల్లి రవీందర్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!