Take a fresh look at your lifestyle.

కుప్పం దేవాలయ విగ్రహాల ద్వంసం కేసు

మతిస్థిమితం లేని మహిళ చేసిన పనిగా గుర్తింపు
కుప్పం విగ్రహాల ధ్వంసం కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేని జ్యోతి అనే మహిళ ఈ ఘాతుకానికి కారణమని జిల్లా ఎస్పీ సెంథిల్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. బుధవారం వి•డియాతో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, కేడర్‌ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీబీఐ విచారణ కోరడం తగదన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే రాజకీయ నాయకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు .చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. కుప్పం మండలం గోనుగురు సవి•పంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ  విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం వి•డియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు.

జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్‌ ‌చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్‌ ‌చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్దారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్‌ ‌కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు.

Leave a Reply