Take a fresh look at your lifestyle.

10 ‌మంది ఇండోనేషియన్లపై కేసు నమోదు: రామగుండం సీఐ కరుణాకర్‌ ‌రావు

10 మంది ఇండోనేషియా దేశస్థులతో పాటు రామగుండం లోని ఒక మసీద్‌ ఇమామ్‌ ‌పై రామగుండం పోలీసుస్టేషన్‌ ‌లో కేసు నమోదు చేసినట్లు రామగుండం సీఐ కరుణాకర్‌ ‌రావు తెలిపారు. పర్యాటక వీసాపై వచ్చిన వీరు పర్యాటక కేంద్రాలను సందర్శించకుండా స్థానికంగా ఉన్న మసీదును సందర్శించారని, కరోనా వైరస్‌ ‌బారిన పడినట్లు తెలిసి కూడా రామగుండం ప్రాంత ప్రజలకు వైరస్‌ను వ్యాపింపజేయాలనే చెడు ఉద్దేశ్యం, నిర్లక్ష్యం కారణంగా ఇతరులకు కరోనా సోకికట్లు వెల్లడించారు.

ఈ సంధర్భంగా వారిపై క్రైం నెంబర్‌ 32/2020 అం‌డర్‌ ‌సెక్షన్‌ 420, 269, 270, ఐపీసీ, సెక్షన్‌ 3ఎపిడమిక్‌ ‌డిసీజస్‌ ‌యాక్ట్-1897, ‌సెక్షన్‌ 51 (‌బీ) డిసాస్టర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌యాక్ట్-2005, ‌సెక్షన్‌ 14(1)(‌బీ), 7, 13, 14(సీ), ఫారినర్స్ ‌యాక్ట్-1946 ‌ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత నెల 14వ తేది ఉదయం వారు ఢిల్లీ నుండి సంపర్క్ ‌క్రాంతి ట్రైన్‌ ‌లో ప్రయాణం చేసి రామగుండం రైల్వే స్టేషన్‌ ‌లో దిగి ముసలియా మజీద్‌ ‌లో ప్రార్థనలు జరిపి కరీంనగర్‌ ‌కి వాహనం లో వెళ్లడం జరిగింది. అక్కడ కరీంనగర్‌ ‌లో వారికీ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారికీ కరోనా పాజిటివ్‌గా తేలినట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply