Take a fresh look at your lifestyle.

గుట్కా వ్యాపారిపై కేసు నమోదు

  • సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌
  • ‌గుట్కాను స్వాధీనం చేసుకున్న సీఐ

నర్మెట మండలంలోని వెల్దండ గ్రామానికి చెందిన సంతోష్‌ ‌కుమార్‌ ‌గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం తెలుసుకొని నర్మెట సీఐ రాపెల్లి సంతోష్‌కుమార్‌, ఎస్‌ఐ ‌జక్కుల పరమేశ్వర్లు కిరాణషాపును తనిఖీచేయగా అందులో సుమారు రూ.28వేల విలువగల గుట్కా ప్యాకెట్స్‌ను కనుగొన్నారు. దొరికిన గుట్కా ప్యాకెట్స్ ఎక్కడివని సంతోష్‌ను పోలీసులు బచ్చన్నపేట మండలంలోని పోచన్నపేట గ్రామానికి చెందిన కొత్త వీరప్రసాద్‌ ‌సరఫరా చేస్తున్నారని పోలీసులకు తెలిపాడు. దీంతో సీఐ సంతోష్‌కుమార్‌ ఆదేశాల మేరకు బచ్చన్నపేట ఎస్‌ఐ ‌రఘుపతి, పోలీస్‌ ‌సిబ్బంది వీరప్రసాద్‌ ‌కిరాణ షాపును తనిఖీ చేయగా అందులో చట్టవిరుద్దమైన బ్లూబుల్‌ ‌ప్యాకెట్స్ 93, అం‌బర్‌ ‌ప్యాకెట్స్ 20‌ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.

ఇరువురిని బచ్చన్నపేట, నర్మెట తహశిల్దార్ల ముందు బైండోవర్‌ ‌చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే గుట్కా, పాన్‌ ‌పరాక్‌ ‌వంటివి విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Leave a Reply