Take a fresh look at your lifestyle.

‌రైతు సమస్యలపై బిజెపి దీక్ష

సత్వరం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్న బండి
హైదరాబాద్‌,‌మే24: రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే దీక్ష చేస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ’తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్ష’ లో భాగంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్నా.. కొనుగోళ్లు జరగడంలేదన్నారు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతే రాజు అని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ‌రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా సీఎం ఫామ్‌ ‌హౌస్‌లో పడుకుంటున్నారన్నారు. వర్షాకాలం ప్రారంభం కాబోతుందని.. ఇంకెప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక ఒరిగింది ఏమిలేదని బండి సంజయ్‌ ‌వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేసీఆర్‌ ‌కాలయముడన్నారు. రైతులు అప్పుల పాలైతుంటే కేసీఆర్‌ ‌కోట్లకుపడగలెత్తుతుండన్నారు. రాష్ట్రంలోని అన్ని మండలాలు గ్రామాలలో కోవిడ్‌ , ‌లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలు పాటిస్తూ దీక్షలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ ‌తో పాటు ముఖ్య నేతలు నిరసన తెలుపుతున్నారు.  ఈ సందర్బంగా మాట్లాడిన బండి సంజయ్‌ ..‌బీజేపీ పోరాటాలతోనే సీఎం ఫాంహౌస్‌ ‌నుంచి బయటకొచ్చిండన్నారు.

బీజేపీ ఓత్తిడితోనే కేసీఆర్‌ ‌రెండు హాస్పిటల్స్ ‌సందర్శించారని అన్నారు. తెలంగాణలో రైతు ఏడుస్తున్నాడన్నారు. కేసీఆర్‌వి ఊకదంపుడు ఉపన్యాసాలన్నారు. ఉచితంగా యూరియా, విత్తనాలు ఎందుకు ఇస్తలేరన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్‌ ‌సీఎం అయ్యాక రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు.కొనుగోలు పూర్తయినా రైతుల అకౌంట్లో డబ్బులు పడడం లేదన్నారు.టీఆర్‌ఎస్‌ ‌నేతలు కవి•షన్‌ ఏజెంట్లుగా మారారన్నారు. కనీసం 75లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కూడా కొనలేదన్నారు.

Leave a Reply