Take a fresh look at your lifestyle.

తెలంగాణ లో కరోనా…

దిల్లీ లో కూడా..ధ్రువీకరించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ  శాఖ
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల పెరుగుతున్నాయి. తాజాగా భారతదేశంలో రెండు కేసులు కనిపించాయి. ఓ వ్యక్తి ఇటలీ నుండి ప్రయాణించి ఢిల్లీకి రాగా  డిల్లీలో ఒక కేసు, మరొకరు  దుబాయ్ సందర్శించి తెలంగాణలో అడుగుపెట్టగా తెలంగాణలో ఓ కేసు కనిపించింది. అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కనీసంగా 60 దేశాలలో కరోనా వైరస్ కేసులు కనిపించాయి. తాజాగా భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు ఐదుకి చేరాయి. దీనికి ముందు, భారతదేశంలో మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి, కేరళ నుండి ఎక్కువ కేసులు ఉండగా  రోగులకు రోగం నయం అయి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొంత మంది కోలుకుంటున్నారు. రోగులు తమ తమ ఇంటిలొనే ఉండాలని రోగులను కేంద్ర ఆరోగ్య శాఖ కోరుతున్నది.
గతంలో వుహాన్ నుంచి తీసుకువచ్చిన భారతీయులను నిర్బంధంలో ఉంచి వైద్యం అందించిన అనంతరం వారిలో కొందరుని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల విడుదల చేసింది. శనివారం, మలేషియా నుండి కొచ్చి చేరుకున్న 26 ఏళ్ల వ్యక్తి తీవ్ర జ్వరం కారణంగా మరణించాడు. కరోనావైరస్ కనిపెట్టటం కోసం ప్రాథమిక చికిత్స చేస్తే నెగిటివ్ వచ్చినప్పటికీ, తొలి మరణం కేరళలో సంభవించిన నేపధ్యంలో మరణానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి ఆరోగ్య శాఖ  నివేదిక కావాలి అని కేరళ ప్రభుత్వాన్ని కోరింది.
యుఎస్‌లో,ఈ వైరస్ కారణంగా రెండవ మరణం సంభవించింది.  చైనాలో బయటపడిన ఈ వైరస్ ఇప్పుడు 60కి పైగా దేశాలలో వ్యాపించి 88,000 మందికి పైగా సోకింది. 2008 ఆర్థిక సంక్షోభం తరువాత ప్రపంచ మార్కెట్లు అతరహా నష్టాలను నమోదు చేస్తున్న తరుణంలో కరోనావైరస్ వేగవంతమైన వ్యాప్తి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది అనే భయాలను పెంచింది. చాలా దేశాలు వైరస్ బారిన పడ్డ దేశాల పౌరులను టూరిజం కోసం తమ దేశాలకు రాకుండా నిషేధించాయి. అలాగే తమ దేశ పౌరులను కరోనా వైరస్ వ్యాధిగ్రస్త దేశాలకు వెళ్లవద్దని అడ్వైజర్లు జారీ చేశాయి.   ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే మ్యూజియం “లౌవ్రే” లో కరోనా వైరస్ గురించి భయపడి, పనిచేయడానికి సిబ్బంది నిరాకరించడంతో  ఆదివారం “లౌవ్రే” మ్యూజియం మూసివేశారు.

Leave a Reply