Take a fresh look at your lifestyle.

ఖమ్మంలో కార్బైడ్‌రహిత మామిడి

వేసవికాలం వచ్చిందంటే మధురఫలంగా చెప్పబడే తీయటి మామిడిపండ్లను తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇటీవల చాలా మంది వ్యాపారులు మామిడిపండ్లను మాగబెట్టటానికి కార్బైడ్‌ ‌వంటి హానికర పదార్దాలు కలపటం వల్ల అవి అనారోగ్యకారకాలు అవుతున్నాయి. అలాకాకుండా మామిడిపండ్లను కార్బైడ్‌రహితంగా మాగెబెట్టి విక్రయిస్తే ఇటు పండులోని సహజమధురత్వాన్ని కాపాడటంతోపాటు ఆరోగ్యపరిరక్షణ కూడా సాధ్యమవుతుందని భావించి గత కొన్నేళ్లుగా కామేపల్లి మండలం గోవింద్రాలకు చెందిన గిరిజన రైతు బానోతు లక్ష్మణ్‌నాయక్‌ ‌పెద్దసంఖ్యలో కార్బైడ్‌ ‌రహిత మామిడిపండ్లను తీసుకోచ్చి ఖమ్మంలో విక్రయిస్తున్నారు ఈ రైతు తనకు గల 10 ఎకరాల మామిడితోటలో కాసిన మామిడికాయలను పక్వానికి వచ్చాక ఎలాంటి రసాయనాలు వాడకుండా శాస్త్రీయపద్దతిలో మాగబెట్టి ఖమ్మం నగర ప్రజలకు కార్బైడ్‌ ‌రహితంగా అందిస్తున్నారు తన మామిడితోటలోని 400 మామిడిచెట్లకు విరగకాసిన విరగకాసిన మామిడికాయలను శాస్త్రీయ పద్దతిలో ప్రతి ఏటా ఖమ్మంలో విక్రయిస్తుండటంతో ప్రజలు సహజంగానే ఈ కార్బైడ్‌రహిత పండ్లపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఉదయం 8 గంటలనుండి సాయంత్రం 6గంటలవరకు ఖమ్మంలోని జిల్లా కేంద్రగ్రంధాలయం ఎదురుగా, ఇల్లందు క్రాస్‌రోడ్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌వద్ద గల రైతు బజార్‌వద్ద వీటి స్టాల్స్ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. ఈ స్టాల్స్ ‌రద్దీగా కనిపిస్తున్నాయి. ఉద్యావనశాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ స్టాల్స్‌లో బంగినపల్లి, హిమాయత్‌, ‌చిన్నరసాలు, చెరుకురసం, దశేరి, పెద్దరసాలు, మల్లిక, తియ్యని మామిడి, సుందరి, అల్పాన్సా, సువర్ణరేఖ, జలాలు, తెల్లగులాబీలు వంటి రకాలు ఉన్నాయి. ఈ కార్బైడ్‌ ‌రహిత పండ్ల వలన స్వచ్చత పోకుండ ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. ఆదర్శరైతుల సంఘం ఆధ్వర్యంలో బానోతు లక్ష్మణ్‌ ఒక రైతుగా స్వయంగా దగ్గరుండి తన కుమారులతో కలసి ఈ పండ్లను విక్రయిస్తున్నారు. ఈసారి మామిడి దిగుబడి సాధారణంగా ఉండటంతో పాటు పంట రకాలు కూడా తక్కువగానే వచ్చాయన్నారు. పచ్చడి మామిడికి కూడా దాదాపు ఇదే కష్టం అన్నారు. ఇటీవల వచ్చిన అకాలవర్షాలకు ఈదురుగాలులకు భారీగా పంట నష్టం జరిగిందన్నారు. ఖమ్మంలో దాదాపు 45 రోజుల పాటు ఈ పండ్ల విక్రయ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!