Take a fresh look at your lifestyle.

బూస్టర్‌ ‌డోసుగా కార్బెవ్యాక్స్ ‌టీకా

అనుమతించిన కేంద్రం

న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : ‌కార్బెవ్యాక్స్ ‌టీకాను కొవిడ్‌ ‌బూస్టర్‌ ‌డోసుగా వాడేందుకు కేంద్రం అనుమతిచ్చింది. పద్దెనిమిదేళ్లు పైబడి వారికి కార్బెవ్యాక్స్ ‌టీకా అందుబాటులోకి రానుంది. గతంలో కొవాగ్జిన్‌, ‌కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్లు తీసుకున్న వారికి కార్బెవ్యాక్స్ ‌ను బూస్టర్‌ ‌డోస్‌ ‌గా ఇవ్వొచ్చని తెలిపాయి ప్రభుత్వ వర్గాలు. ప్రైమరీ వ్యాక్సినేషన్‌ ‌లో ఇచ్చిన డోస్‌ ‌తో పాటు బూస్టర్‌ ‌డోస్‌ ‌గా వ్యాక్సిన్‌ ఆమోదించడం ఇదే తొలిసారి.

వ్యాధి నిరోధక శక్తిపై నేషనల్‌ ‌టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ‌కి చందిన కొవిడ్‌ 19 ‌వర్కింగ్‌ ‌గ్రూప్‌ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు ఆమోద ముద్ర వేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. ప్దదెనిమిదేళ్లు పైబడిన వారు కొవాగ్జిన్‌ ‌లేదా కొవిషీల్డ్ ‌రెండో డోసుగా తీసుకున్న డేట్‌ ‌నుంచి ఆరు నెలల తర్వాత ప్రికాషనరీ డోస్‌ ‌గా కార్బెవాక్స్ ‌తీసుకోవచ్చని తెలిపింది. కార్బెవాక్స్ ‌కోసం కొవిన్‌ ‌పోర్టల్‌ ‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

Leave a Reply