Take a fresh look at your lifestyle.

మియాపూర్ లో కారు బీభత్సం.. ఒకరి మృతి, పలు వాహనాలు ధ్వంసం

Car collision in Miyapur, one dead and several vehicles damaged
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా తన వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమయ్యాడు ,వివరాల్లోకి వెళితే  మంగళవారం రాత్రి 12 45 నిమిషాలకు మద్యం మత్తులో ఉన్న యువకుడు వెర్నా కారు AP09 BS 5786 ను మితిమీరిన వేగంతో నడుపుతూ, మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తా నుండి, మాదాపూర్ వెళ్తున్న క్రమంలో, హఫీజ్ పేట్   ఫ్లైఓవర్ సమీపంలోని “ఎస్ఎస్ గ్రాండ్ కేఫ్ “హోటల్ వద్ద స్నేహితుల గురించి వేచి ఉన్న బిహెచ్ఎల్ ఎమ్ఐజి చెందిన  అప్సర్ అనే వ్యక్తిని, బలంగా ఢీ కొట్టడంతో, తీవ్రమైన  గాయాలకు గురైన అప్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇతను సంగారెడ్డి జిల్లా కంది లో గల కొత్వాల్ హై స్కూల్లో కరస్పాండెంట్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు., ఈ సంఘటనలో ప్రక్కనే ఉన్న ఒక కారు, పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి, సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదంలో మృతి చెందిన అఫ్సర్ మృతదేహాన్ని  గాంధీ హాస్పిటల్ మార్చురీకి  తరలించారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటనా స్థలంలో ధ్వంసమైన పలు వాహనాలను మియాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply