Take a fresh look at your lifestyle.

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బంధువుల.. అనుమానాస్పద ప్రమాదం

  • అలుగునూరు వద్ద కాకతీయ కాలువలో బయటపడ్డ కారు.. 
  • కుళ్లిపోయిన  మృతదేహాలు..గతనెల 27న కాలువలో పడిన కారు..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ ‌రెడ్డి బంధువులకు చెందిన మూడు మృతదేహాలు  కాకతీయ కెనాల్‌లో బయటపడడం కలకం రేపుతోంది. తిమ్మాపూర్‌ ‌మండలం అలుగనూరు వద్ద కెనాల్‌ ‌లో తేలియాడుతున్న కారును క్రేన్‌ ‌సహాయంతో పోలీసులు బయటకు తీశారు. కారులో కుళ్లిపోయిన మూడు మృతదేహాలను గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్‌ ‌కాలనీకి చెందిన సత్యనారాయణ రెడ్డి కారుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిగా గుర్తించారు.  మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ ‌రెడ్డి బావ, చెల్లెలు, మేనకోడలిగా గుర్తించారు. జనవరి 27న హైదరాబాద్‌ ‌వెళ్తున్నా మంటూ వెళ్లారు. అయితే అప్పటి నుంచి వారి ఆచూకి కనిపించలేదంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని సిపి వెల్లడించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చెల్లెలి కుటుంబం అదృశ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం ఎల్‌ఎం‌డీ కాకతీయ కెనాల్‌లో ఓ కారును పోలీసులు వెలికితీశారు. అందులో మూడు మృత దేహాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారు ఎమ్మెల్యే దాసరి సోదరి కుటుంబసభ్యులుగా నిర్దారించారు. కారు 20 రోజుల క్రితమే కాల్వలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే గత 20 రోజులుగా కుటుంబసభ్యులు కనిపించకపోయినా ఎమ్మెల్యే, పోలీసులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ ‌స్పందిస్తూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తమ సోదరి కుటుంబసభ్యులు తరచూ విహార యాత్రలకు వెళ్తుంటారని…ఇప్పుడు అలాగే వెళ్లారనుకున్నామని మనోహర్‌ ‌వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై సీపీ కమల్‌హాసన్‌ ‌మాట్లాడుతూ కారు నెంబరు ఆధారంగా ఎమ్మెల్యే సోదరిగా గుర్తించామన్నారు. ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వివరాలు రాలేదని తెలిపారు. మిస్సింగ్‌ ‌కేసు నమోదైందో కాలేదో తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు. విచారణ తర్వాత
పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీపీ కమల్‌హాసన్‌రెడ్డి తెలిపారు.

కాకతీయ కెనాల్‌లో నీటి ప్రవాహాన్ని నిలిపి వేయగా యాదాల పల్లి వద్ద కారు బయటకి తేలింది. దీంతో పోలీసులు కారును బయటికి తీశారు. అయితే కారు నెంబరు ఆధారంగా కారులో లభ్యమైన మృతదేహాలను ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ ‌సోదరి నారెడ్డి రాధ కుటుంబానివిగా గుర్తించినట్టు సీపీ కమల్‌హాసన్‌రెడ్డి తెలిపారు. కారులో రాధతో పాటు ఆమె భర్త సత్యనారాయణ, కూతురు వినయశ్రీ మృతదేహాలు లభ్యమయ్యాయి. సత్యనారాయణరెడ్డి కరీంనగర్‌లో ఫీడ్‌ ‌వ్యాపారం చేస్తుండగా.. రాధ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. వినయశ్రీ నిజామాబాద్‌లోని డెంటల్‌ ‌కళాశాలలో బీడీఎస్‌ ‌తృతీయ సంవత్సరం చదువుతోంది. 20 రోజుల క్రితం  అదృశ్యమైన రాధిక కుటుంబ సభ్యలు పూర్తిగా కుళ్లిన శవాలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు. కాగా నిన్న సాయంత్రం బైక్‌పై వెళుతున్న ఓ జంట ప్రమాదవశాత్తు కాలువలో పడటంతో అధికారులు నీటిని నిలిపి వేశారు. దీంతో కారు బయటికి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నుంచి ముగ్గురిని బయటకు తీశారు. అనంతరం కారు నంబర్‌ ఆధారంగా పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ ‌రావు సోదరి రాధిక కుటుంబ సభ్యులుగా గుర్తించారు. అయితే జనవరి 27 న బయటకు వచ్చిన రాధిక కుటుంబం ఇప్పటి వరకు కనిపించకపోయినా ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఘటనా స్థలానికి ఎమ్మెల్యే మనోహార్‌, ‌కలెక్టర్‌, ‌సీపీ కమల్‌హాసన్‌రెడ్డి చేరుకున్నారు, అనంతరం ఎమ్మెల్యే డియాతో మాట్లాడారు.. తమ కుటుంబానికి సోదరి మరణం తీరని దెబ్బవంటిదన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని.. సోదరి కుటుంబం తరచుగా విహార యాత్రలకు వెళ్తూ ఉంటారని పేర్కొన్నారు. అయితే గత 20 రోజులుగా వారితో సంబంధాలు లేవని అందుకే ఎలాంటి అనుమానం రాలేదని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి వివరాలు రాలేదని, మిస్సింగ్‌ ‌కేసు నమోదైందో తెలియాల్సి ఉందన్నారు.  పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని సీపీ కమలాహాసన్‌ అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply