Take a fresh look at your lifestyle.

పటాన్‌ ‌చెరు ఓఆర్‌ఆర్‌ ‌పై ఘోర రోడ్డు ప్రమాదం

  • కారును డీసీఎం ఢీకొట్టడంతో ఆరుగురు మృతి, ముగ్గురికి గాయాలు
  • మృతులు జార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌కార్మికులు

పొట్టకూటి కోసం ఊరు గాని ఊరులో పని చేసుకుని స్వగ్రామానికి రోడ్డు మార్గంలో కారులో బయలుదేరుతున్న తరుణంలో నిద్రలోనే ఉండగానే ఆరుగురు జీవితాలు తెల్లవారుతూనే చీకటి అయ్యాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌ ‌చెరు మండల పరిధిలోని ముత్తంగి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై పాటి గ్రామ సమీపంలో మంగళవారం
తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న డిఎల్‌ 5 ‌సీఈ 5176 కారును మరో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. ఘటన స్థలానికి సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, పటాన్‌ ‌చెరు ఇంచార్జి డీఎస్పీ శ్రీధర్‌ ‌రెడ్డిలు సందర్శించారు. ప్రమాదంపై ఎస్పీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..ముత్తంగి ఓఆర్‌ఆర్‌ ‌సమీపం పాటి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, జైలో కార్లో మొత్తం 9 మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఆరుగురు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలపాలయ్యారని చెప్పారు. క్షతగాత్రులను, గాయపడిన వారిని వెంటనే పటాన్‌ ‌చెరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించామని చెప్పారు. వీరంతా బెంగళూరు నుండి జార్కండ్‌, ఉత్తర ప్రదేశ్‌కు వెళుతున్న వ్యక్తులుగా గుర్తించామన్నారు. ముందు వాహనాన్ని ఓవర్‌ ‌టెక్‌ ‌చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తుందన్నారు. జైలో వాహనం డ్రైవ్‌ ‌చేస్తుంది ఎవరు అనేది తెలియాల్సి ఉందన్నారు. జైలో వాహనాన్ని ఢీ కొట్టిన మరో వెహికిల్‌ ‌కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరంతా ఓ ప్రైవేట్‌ ‌కంపెనీలో కార్పెంటర్లుగా పనిచేస్తున్నారని వీరితో పాటు ఉన్న వ్యక్తి తెలిపాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు… కమలేష్‌ ‌లోహరే, హరి లోహరే, ప్రమోద్‌ ‌భుహెర్‌, ‌వినోద్‌ ‌భుహెర్‌ ‌లు రాంఘడ్‌ ‌ప్రాంతానికి చెందిన వారు. పవన్‌ ‌కుమార్‌- ‌గోరకపూర్‌ (‌బాంగ్లాదేశ్‌ ‌చందిన వాడు) వివరాలు తెలియవు. గాయపడిన వారు… ప్రమోద్‌ ‌కుమార్‌, అర్జున్‌, ఆనంద్‌ ‌కుమార్‌, ‌చంద్ర, వంశీలు గోరకపూర్‌ ‌నివాసులు.

రోడ్డు ప్రమాదం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్‌ ‌దిగ్భ్రాంతి
మంగళవారం తెల్లవారుజామున పటాన్‌ ‌చెరు ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల పటాన్‌ ‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ ‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లక్షా 50 వేల రూపాయలు సొంత నిధులతో అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు మృతదేహాలను తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply