Take a fresh look at your lifestyle.

రేపటి ఐసోలాషన్‌ ‌కి సిద్ధం అవుతున్న దేశ రాజధాని

ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ నేపద్యంలో అనవసరమైన ప్రయాణాలన్నింటినీ మానుకుని తాము ఉంటున్న నగరాలలో, పట్టణాల్లోనే స్వీయ గృహ నిర్బంధం లో ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం పౌరులను కోరారు. ‘‘ప్రతి చిన్న ప్రయత్నం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’’ అని ఆయన ట్విట్టర్‌లో రాశారు. కరోనా కేసుల సంఖ్య 298కు పెరిగిందని, ఇందులో 23 మంది కోలుకున్నారని, నాలుగు మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్థాన్‌, ‌హర్యానా, పంజాబ్‌, ‌వడోదర, నోయిడాతో సహా పలు చోట్ల శనివారం నమోదయ్యాయి.భారతదేశంలో కనీసం 111 లాబ్‌ ‌లు శనివారం వరకు పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లావ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు.

మొత్తం దేశవ్యాప్తంగా 1,600 మందిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ఇచ్చింది, రోమ్‌ ‌నుండి 262 మంది భారతీయులు, వీరిలో ఎక్కువగా విద్యార్థులు వున్నారు. శనివారం దేశానికి తిరిగి వస్తున్నారు. వీరందరినీ ముందు నిర్బంధ కేంద్రాలలో ఉంచుతారు.కోవిడ్‌-19 ‌వ్యాప్తి నేపథ్యంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు రెట్టింపు చేస్తామని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ‌హామీ ఇచ్చారు. రాజధానిలో ఉన్న నిరాశ్రయులను రెహన్‌ ‌బాసేరాలలో నివాసం ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారం ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రకటించారు.‘జనతా కర్ఫ్యూ’ సందర్భంగా ఢిల్లీలో ఆదివారం 50 శాతం బస్సులు పనిచేయవు అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ‌తెలిపారు. కరోనావైరస్‌ ‌వ్యాప్తి వల్ల రోజువారీ కూలీ కార్మికులలో తీవ్రమైన ఆందోళన ఉందని, అయితే ఏ వ్యక్తి ఖాళీ కడుపుతో పడుకోకుండా ఉండేందుకు రేషన్‌ ‌పథకంపై ఆధారపడిన 72 లక్షల మందికి ఉచిత రేషన్‌ అం‌దించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని కేజ్రీవాల్‌ ‌తెలిపారు. ప్రతి వ్యక్తికి సాధారణంగా లభించే 5 కిలోలకు బదులుగా 7.5 కిలోల రేషన్‌ ‌పెంచినట్లు అని కేజ్రీవాల్‌ ‌చెప్పారు.

Leave a Reply