Take a fresh look at your lifestyle.

కొరోనాతో కలవలేకపోతున్నా…: మంత్రి హరీష్‌రావు

  • మీరు చూపించే అభిమానానికి పేరుపేరునా కృతజ్ఞతలు
  • ఎలాంటి వేడుకలొద్దనీ అభిమానులకు విజప్తి చేస్తున్నా…
  • ట్విట్టర్‌ ‌ద్వారా పిలుపునిచ్చిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, జూన్‌ 2 (‌ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జూన్‌ 3(‌గురువారం)న బర్త్‌డే అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మంత్రి హరీష్‌రావు బర్త్ ‌డే వేడుకలకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని ఈ మేరకు బుధవారం మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ ‌వేదికగా వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…కొరోనా కారణంగా ఈసారి కూడా ఎవర్నీ కలవలేకపోతున్నా.

మిత్రులకు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్‌ 3)‌న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజతలు. కొరోనా, లాక్‌డౌన్‌ ‌కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సమయంలో స్వీయ నియంత్రణ పాటించాలని, బర్త్‌డే సందర్భంగా ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని అభిమానులకు విజప్తి చేస్తున్నా. మీ అభిమానానికి కృతజతలు అంటూ తన ట్విట్టర్‌లో మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు.

Leave a Reply